AKhil Akkineni ఈ సారి సిక్స్ ప్యాక్‌తో కనిపించిన అఖిల్: గుడ్ న్యూస్ కూడా చెప్పేశారుగా
అప్పుడెప్పుడో హీరోగా పరిచయం అయినప్పటికీ.. ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు అక్కినేని వారసుడు అఖిల్. వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న అతడు.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి 'ఏజెంట్' అనే సినిమాను చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ భారీ చిత్రం నుంచి అదిరిపోయే పోస్టర్‌తో పాటు ఓ గుడ్ న్యూస్ కూడా వచ్చేసింది.
అక్కినేని అఖిల్.. సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న 'ఏజెంట్' మూవీ షూటింగ్ ఈరోజు ఉదయం అధికారికంగా ప్రారంభం అయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. 'కిల్లర్ అఖిల్.. స్టన్నర్ సురేందర్ రెడ్డి సూపర్ చార్జర్‌తో యాక్షన్‌ను ప్రారంభించారు. కచ్చితమైన ప్రణాళిక.. తీవ్రమైన శిక్షణ తర్వాత మా ఏజెంట్ మూవీ షూటింగ్ ఈరోజు మొదలైంది' అని ట్వీట్ చేసింది.

అంతేకాదు, అఖిల్ అక్కినేని సంబంధించిన ఓ సాలిడ్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో అతడు బనియన్‌ను పైకి తీసేసి సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తున్నాడు. అలాగే, ప్యాంట్‌లో తుపాకీని కూడా పెట్టుకుని ఉన్నాడు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్పై థ్రిల్లర్‌గా రాబోతున్న 'ఏజెంట్' మూవీ అఖిల్ రా ఏజెంట్‌గా నటిస్తున్నాడు. అలాగే, మలయాళ స్టార్ మమ్ముట్టి కూడా ఇందులో నటిస్తున్నారు. వీళ్లతో పాటు ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇక, ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. చాలా కాలం తర్వాత వక్కంతం వంశీ రచయితగా మారి కథను అందిస్తున్నాడు. థమన్ సంగీతం సమకూర్చబోతున్నాడు.


Click it and Unblock the Notifications











