దటీజ్ అఖిల్ అక్కినేని.. ఎవరి పెళ్లికి హాజరయ్యారో తెలుసా!
సినిమా స్టార్లకు వారి వద్ద పనిచేసే సిబ్బంది మధ్య విడదీయలేని అనుబంధం ఉంటుందనే విషయం పలు సందర్భాల్లో వ్యక్తమైంది. తమ వద్ద పనిచేసే వారి ఇంట్లో ఎలాంటి కార్యం జరిగినా చాలా మంది హీరో, హీరోయిన్లు, నటీనటులు వారికి సంతోషంలో భాగం పంచుకొంటారు. అలాగే తమ సిబ్బందిని బాగా చూసుకొంటారని ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి మంచి పేరుంది. అసలు వివరాల్లోకి వెళితే..

తాజాగా తన సిబ్బంది అంటే ఎంత ఇష్టమో అనే విషయాన్ని అక్కినేని వారసుడు అఖిల్ నిరూపించాడు. తన వ్యక్తిగత సిబ్బందిలో ఒకరైన మోజెస్ వివాహం శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కడియంలో జరిగింది. ఈ వివాహానికి మోసెస్ స్వయంగా హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు అందించారు.

మోసెస్ పెళ్లికి అఖిల్ అక్కినేని హాజరుకావడంతో పెళ్లి మరింత సందడిగా మారింది. అఖిల్‌తో ఫోటోలు దిగడానికి పెళ్లికి హాజరైన అతిథులు పోటీపడ్డారు. అడిగిన ప్రతీవారితో అఖిల్ ఫొటోలు దిగినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











