Agent ప్లాప్‌పై అఖిల్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్.. నిర్మాత ఏమన్నారో తెలుసా?
అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన మరో హ్యాండ్సమ్ హీరో అఖిల్. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన అఖిల్ సినిమాతో హీరోగా డెబ్యూ చేసినా అతనికి అనుకున్నంతగా విజయం వరించలేదు. తర్వాత వరుసగా సినిమాలన్నీ ప్లాప్స్ మూటగట్టుకున్నాయి. ఇక తాజాగా ఎన్నో ఆశలు పెట్టుకున్నన ఏజెంట్ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఏజెంట్ ఫెయిల్యూర్ పై తొలిసారిగా స్పందించాడు అక్కినేని అఖిల్. ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూనే మరోవైపు క్షమాపణలు కూడా తెలిపాడు.
వరుసగా సినిమాల ప్లాప్ చూసిన అక్కినేని అఖిల్ కు 2021లో వచ్చిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాతో కాస్తా సక్సెస్ దక్కింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో అఖిల్ సక్సెస్ ట్రాక్ ఎక్కినప్పటికీ హీరోగా స్టార్ డమ్ మాత్రం తెచ్చుకోలేకపోయాడు. అలా మాస్ హీరోగా, మంచి క్రేజ్ తెచ్చుకోవాలనుకుని నటించిన సినిమా ఏజెంట్. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.

ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా డిజాస్టర్ టాక్ అందుకుంది. ఈ విషయంపై తొలిసారిగా అఖిల్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యాడు. "ఏజెంట్ సినిమా టీమ్ కు, దాన్ని తెరకెక్కించడంలో తమ జీవితాలు అంకితం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఎంతో కష్టపడినప్పటికీ దురదృష్టవశాత్తు మేము అనుకున్న విధంగా స్క్రీన్ పైకి తీసుకురాలేకపోయాం. ఆ విధంగా మంచి చిత్రాన్ని అందించలేకపోయాం" అని అఖిల్ రాసుకొచ్చాడు.
అఖిల్ ట్వీట్ లో ఇంకా కొనసాగిస్తూ.. "నాకు ఎంతో అండగా నిలిచిన చిత్ర నిర్మాత అనిల్ సుంకర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా చిత్రాన్ని నమ్మిన డిస్ట్రిబ్యూటర్లు, సపోర్ట్ చేసిన మీడియాకు థ్యాంక్స్. అభిమానులు, శ్రేయోభిలాషులు ఇస్తున్న ప్రేమ వల్లే నేను కష్టపడి వర్క్ చేస్తున్నా. నాపై నమ్మకం పెట్టుకున్న వారి కోసం మరింత దృఢంగా సిద్ధమై మళ్లీ వస్తాను" అని చెప్పుకొచ్చాడు.
అఖిల్ లేటెస్ట్ ట్వీట్ వైరల్ కాగా.. దీనిపై నిర్మాత అనిల్ సుంకర స్పందించారు. "ప్రియమైన అఖిల్. నీ హార్డ్ వర్క్, పట్టుదల, శ్రమించే తత్వం త్వరలోనే నిన్ను మంచి విజయంతో తిరిగి తీసుకొస్తాయి. మేమందరం నిన్ను ప్రేమిస్తున్నాం. నువ్ విజయం సాధించడాన్ని త్వరలోనే చూస్తాం" అని అనిల్ ఆప్యాయంగా రాసుకొచ్చారు.


Click it and Unblock the Notifications











