సమంతకు అక్కినేని ఫ్యామిలీ నుంచి విషెస్.. అలా ఓపెన్ అయిన అఖిల్

టాలీవుడ్‌లో స్టార్ కపుల్‌గా ఓ వెలుగు వెలిగింది అక్కినేని నాగచైతన్య - సమంత జోడీ. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొద్దికాలానికే విడాకులు తీసుకోవడం చిత్ర పరిశ్రమను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఈ ఇష్యూని అభిమానులు మరిచిపోలేకపోతున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య, సమంతల దారులు వేరయ్యాయి. శోభితను నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోగా.. దర్శకుడు రాజ్ నిడిమోరు సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విడాకుల తర్వాత అక్కినేని ఫ్యామిలీతో సమంతకు సంబంధాలు కట్ అయ్యాయి.

అయితే అక్కినేని ఫ్యామిలీకి చెందిన కొందరితో సమంత ఇప్పటికీ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారని ఫిలింనగర్ టాక్. సుప్రియ యార్లగడ్డ, రానా దగ్గుబాటి, అఖిల్ అక్కినేనిలపై సామ్ తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. నాగచైతన్యతో విడిపోయినప్పటికీ అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్‌పై ఆమె ఏనాడూ పబ్లిక్‌గా మాట్లాడలేదు. ఇటీవల సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా అడివి శేష్ హీరోగా వచ్చిన డెకాయిట్ మూవీ రిలీజ్ సందర్భంగా సుప్రియకు ఆల్ ది బెస్ట్ చెప్పారు సమంత. నీ కృషి, పట్టుదల, డెకాయిట్ కోసం నువ్వు పడిన కష్టం అన్ని స్వయంగా చూశా.. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలంటూ సమంత పోస్ట్ పెట్టారు.

Akhil Akkineni extends wishes to Samantha for Maa Inti Bangaram success

ఇక లాంగ్ గ్యాప్ తర్వాత సమంత తెలుగులో నటించిన మూవీ మా ఇంటి బంగారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బీవీ నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సమంత స్వయంగా నిర్మించారు. అలాగే తన భర్త రాజ్ నిడిమోరు క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దగ్గుబాటి సురేష్ బాబు వస్తుండగా.. కుర్చీలో కూర్చొన్న సమంత లేచి వెళ్లి స్వయంగా లోపలికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అయ్యింది.

జూన్ 19న మా ఇంటి బంగారం విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ 100 కోట్ల రూపాయలకు చేరువైంది. తద్వారా టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో 100 కోట్ల మార్క్ చేరుకున్న తొలి మూవీగా రికార్డ్ సృష్టించేందుకు వడివడిగా మా ఇంటి బంగారం అడుగులు వేస్తోంది. ఈ సినిమా సక్సె అవ్వగా.. సమంత మరో గుడ్ న్యూస్ చెప్పారు. తాను త్వరలో తల్లిని కాబోతున్నట్లు ప్రకటించి ఈ ఆనందాన్ని రెట్టింపు చేశారు. దాంతో సమంత అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా మా ఇంటి బంగారం ఘన విజయం సాధించడంపై అక్కినేని ఫ్యామిలీ మెంబర్ స్పందించారు. అది ఎవరో కాదు స్వయంగా అక్కినేని నాగచైతన్య తమ్ముడు అఖిల్.

తన లేటెస్ట్ మూవీ లెనిన్. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించారు. జూలై 10న లెనిన్ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లు ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. లెనిన్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల్ మా ఇంటి బంగారంపై స్పందించారు. లెనిల్ ప్రమోషన్స్‌లో ఉండటంతో రెండు మూడు వారాలుగా బిజీగా ఉన్నా. ట్రైలర్ చూశాను చాలా బాగుంది. ఈ మూవీ వైబ్ సూపర్. ఆ టీమ్‌కి కంగ్రాట్స్. మా ఇంటి బంగారం అని పేరు పెట్టుకుని అలాంటి యాక్షన్ చేయడం అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సమంత చాలా బాగా నటించారు అని అఖిల్ అక్కినేని ప్రశంసించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారగా.. దీనిపై సమంత ఎలా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X