మరో ప్రాజెక్టుకు అఖిల్ గ్రీన్ సిగ్నల్: ఈ సారి టాలెంటెడ్ డైరెక్టర్‌తో లవ్ స్టోరీ
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో చాలా మంది సక్సెస్‌ను అందుకుని స్టార్లుగా వెలుగొందుతున్నారు. అయితే, చాలా కాలం క్రితమే హీరోగా పరిచయం అయినా.. ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా అందుకోలేకపోయాడు అక్కినేని వారసుడు అఖిల్. 'అఖిల్', 'హలో', 'మిస్టర్ మజ్నూ' వంటి హ్యాట్రిక్ ఫ్లాపులను మూటగట్టుకున్న అతడు.. హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుస పెట్టి సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో ప్రాజెక్టుకు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.
ప్రస్తుతం అక్కినేని అఖిల్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది. అయినప్పటికీ ఈ యంగ్ హీరో వరుసగా పలువురు దర్శకులకు పచ్చజెండా ఊపుతున్నాడు. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో శ్రీను వైట్లతో సినిమా చేయడానికి ఒప్పుకున్న అఖిల్.. ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడితో ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నట్లు ఫిలిం నగర్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ ప్రాజెక్టు 2022 ఆరంభంలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఇదిలా ఉండగా.. అక్కినేని అఖిల్ ఇప్పటికే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమా చేశాడు. ఎప్పుడో షూట్ పూర్తి చేసుకున్న ఈ మూవీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇక, త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంపై అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. మరోవైపు, సురేందర్ రెడ్డితో చేస్తోన్న 'ఏజెంట్' మూవీలో అఖిల్ రా ఏంజెంట్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.


Click it and Unblock the Notifications











