అఖిల్ అక్కినేనితో స్టార్ డైరెక్టర్ భారీ బడ్జెట్ మూవీ.. ఏప్రిల్ 7న క్రేజీ న్యూస్
అక్కినేని నట వారసుడు అఖిల్ అక్కినేని మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మూడు సినిమాలతో సక్సెస్ కొట్టేందుకు అఖిల్ తన వంతు ప్రయత్నం చేశారు. ప్రస్తుతం తన ఐదో సినిమాతో మరోసారి బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకొనేందుకు ప్లాన్ చేశాడు.
ఇక తన నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రిలీజ్ కాకముందే ఐదో సినిమాకు అఖిల్. శ్రీకారం చుట్టాడు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాతగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతున్నది.

ఇదిలా ఉండగా, అఖిల్ సినిమా కెరీర్‌లోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నది. ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభోత్సవం కానున్నది.
ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











