Most Eligible Bachelor Trailer: పిచ్చ రొమాంటిక్‌గా బ్యాచ్‌లర్.. ఆ హీరోయిన్లంతా స్పెషల్‌గా!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చాలా కాలం క్రితమే హీరోగా పరిచయం అయినా.. ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు అక్కినేని వారసుడు అఖిల్. వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'అఖిల్'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఆ తర్వాత 'హలో', 'మిస్టర్ మజ్నూ' వంటి సినిమాలు చేసినా విజయం మాత్రం దక్కలేదు. దీంతో అతడు సక్సెస్ కోసం నిరీక్షిస్తూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు అక్కినేని అందగాడు రొమాంటిక్ జోనర్‌లో ఓ సినిమాను చేసి రెడీగా ఉన్నాడు.

అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ మూవీ షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తైంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. కానీ, కరోనా రెండు లాక్‌డౌన్ల కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. దీనికి తోడు కొన్ని రీషూట్ల వల్ల ఇది మరింత లేట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఫస్ట్ కాపీ రెడీ అయింది. దీనిపై చిత్ర యూనిట్ సంతృప్తిగా ఉందట. దీంతో దీన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు. ఇటీవలే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు.

Akhil Akkineni Most Eligible Bachelor Trailer Released

రొమాంటిక్ ఫీల్ గుడ్ జోనర్‌లో అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీని అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను సైతం ముమ్మరం చేసేశారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం రొమాంటిక్‌గా సాగిన ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో హీరో క్యారెక్టర్‌ను కళ్లకు కట్టినట్లు చూపించారు. అదే సమయంలో హీరోయిన్ పూజా హెగ్డే రోల్ మీద కూడా క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత రెట్టింపు అయిపోయాయి.

తాజాగా విడుదలైన ట్రైలర్‌లో అక్కినేని అఖిల్.. పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిలు ఎలా ఉండాలన్న దానిపై ఫుల్ క్లారిటీతో ఉంటాడు. ఈ క్రమంలోనే తనను కలిసిన యువతులతో అదే రీతిలో మాట్లాడతాడు. దీంతో అతడిని పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రారు. అయితే, అచ్చం హీరోలాగే ఆలోచించే పాత్రలో పూజా హెగ్డే కనిపిస్తుంది. ఆమె కూడా తన లైఫ్ పార్ట్‌నర్‌ విషయంలో క్లారిటీగా ఉంటుంది. ట్రైలర్ చివర్లో హీరో కోర్టుకు వెళ్లాల్సి వచ్చిన విషయాన్ని కూడా చూపించారు. ఇక, ఇందులో ఫరియా అబ్దుల్లా, ఈషా రెబ్బా తదితర హీరోయిన్లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో అఖిల్ రొమాంటిక్ రోల్‌లో నటించాడు. అతడికి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే చేసింది. ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే దీని నుంచి విడుదలైన పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో భారీ స్పందన వచ్చింది. ఇక, ఈ సినిమాపై అక్కినేని అఖిల్‌తో పాటు అతడి అభిమానులు ఎన్నో నమ్మకాలను పెట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X