మరో సినిమాను లైన్‌లో పెట్టిన అఖిల్: మళ్లీ గ్రాండ్‌గానే ప్లాన్ చేశాడుగా
'అఖిల్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు అక్కినేని వారసుడు అఖిల్. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఆ తర్వాత వచ్చిన 'హలో', 'మిస్టర్ మజ్నూ' వంటి సినిమాలు కూడా అతడికి విజయాన్ని అందించలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యంగ్ హీరో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమా చేశాడు. అయితే, అనివార్య కారణాల వల్ల ఇది ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయినప్పటికీ అతడు వరుసగా మరికొన్ని చిత్రాలను లైన్‌లో పెట్టేసుకుంటున్నాడు.
చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తోన్న అక్కినేని అఖిల్.. తాజాగా మరో సినిమాను లైన్‌లో పెట్టుకున్నాడని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీతో రూపొందబోతుందట. దీన్ని బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి శంకర్, నవీన్ యెర్నేని నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాకు దర్శకత్వం వహించబోయేది ఎవరన్న విషయం మాత్రం బయటకు రాలేదు. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. అక్కినేని అఖిల్ ప్రస్తుతం స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో 'ఏజెంట్' అనే సినిమాను చేస్తున్నాడు. స్పై థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాలో అతడు స్పై ఏజెంట్‌గా నటించబోతున్నాడని అంటున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. చాలా కాలం తర్వాత వక్కంతం వంశీ రచయితగా మారి కథను అందిస్తున్నాడు. థమన్ సంగీతం సమకూర్చబోతున్నాడు. ఇక, ఈ సినిమా డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.


Click it and Unblock the Notifications











