Agent: అక్కినేని ఫ్యాన్స్‌కు నెగెటివ్ న్యూస్.. అఖిల్ అలా షాకివ్వడం ఖాయమట

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది స్టార్లు తమ పిల్లలను హీరోలుగా పరిచయం చేశారు. అందులో అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ ఒకడు. చిన్నప్పుడే 'సిసింద్రీ'గా ప్రేక్షకులను అలరించిన ఈ కుర్రాడు.. కొన్నేళ్ల క్రితం 'అఖిల్' అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోగా.. బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఆ తర్వాత అఖిల్ 'హలో' అనే సినిమాతో రీలాంచ్ అయ్యాడు. అది కూడా అతడికి విజయాన్ని మాత్రం ఇవ్వలేదు. అనంతరం చేసిన 'మిస్టర్ మజ్నూ' అదే ఫలితాన్ని చవి చూసింది. దీంతో అతడి కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోతుందేమో అని అంతా అనుకున్నారు.

హీరోగా పరిచయం అయినప్పటి నుంచి వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న అక్కినేని అఖిల్ గత ఏడాది 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో ఆశల నడుమ భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీతో అతడు తొలిసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. దాదాపు రూ. 19 కోట్ల టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఫుల్ రన్‌లో రూ. 23 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. దీంతో దీనికి హిట్ స్టేటస్ అందుకోవడంతో పాటు రూ. 4 కోట్లకు పైగా లాభాలు కూడా వచ్చాయి. ఈ ఉత్సాహంతోనే తన ఫ్యూచర్ ప్రాజెక్టులను ఈ యంగ్ హీరో లైన్‌లో కూడా పెట్టుకున్నాడు.

 Akhil Akkineni Negative Role Highlight in Agent Movie

టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో అక్కినేని అఖిల్ సినిమాను గత ఏడాదిలోనే మొదలు పెట్టాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాకు 'ఏజెంట్' అనే టైటిల్ పెట్టారు. దీని షూటింగ్ గత ఏడాది ప్రారంభం అయింది. ఇందులో అక్కినేని అఖిల్ రా ఏజెంట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అతడు ఎన్నో విద్యల్లో శిక్షణను కూడా తీసుకున్నాడు. అదే సమయంలో ఫిజిక్‌ విషయంలోనూ వైవిధ్యాన్ని చూపించేందుకు బల్క్ బాడీతో తయారయ్యాడు. కొద్ది రోజుల క్రితమే అతడి సిక్స్ ప్యాక్‌ను చూపిస్తూ రెండు పోస్టర్లను విడుదల చేశారు. దీంతో దీనిపై ఆదిలోనే భారీ అంచనాలు నెలకొన్నాయి.

'ఏజెంట్' మూవీ షూటింగ్ ప్రారంభమై చాలా రోజులే అవుతోన్నా ఇది సజావుగా సాగడం లేదు. ఇప్పటికే ఎన్నోసార్లు చిత్రీకరణకు బ్రేకులు పడ్డాయి. దీంతో చిత్ర యూనిట్ దీన్ని ఎప్పుడు పూర్తి చేస్తోందో అన్న క్లారిటీ రావడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ న్యూస్ లీకైంది. ఈ సినిమా విడుదల ఆగస్టు 12 నుంచి మరోసారి వాయిదా పడబోతుందట. షూటింగ్ అంతకంతకూ ఆలస్యం అవుతుండడం వల్లే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుందని తెలిసింది. అలాగే, ఇందులో అఖిల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడని కూడా మరో న్యూస్ లీకైంది.

భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఏజెంట్' మూవీలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత, డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్‌హాప్ తమీజా సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X