అలా అంటే రామ్ చరణ్ కొడుతాడు.. పెద్దిపై అఖిల్ అక్కినేని కామెంట్స్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన సినిమా పెద్ది. ఈ ఏడాది టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న'పెద్ది', మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమా కలెక్షన్లను అధిగమించి కొత్త రికార్డు నెలకొల్పింది. ఇలాంటి పెద్ది సినిమా, రామ్ చరణ్ పై అక్కినేని హీరో అఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?

అక్కినేని నటవారసుడుగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు అఖిల్ అక్కినేని. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాల్లో ఏదీ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ విజయాన్ని అందుకోలేకపోయింది. నటుడిగా ప్రతి సినిమాకు కొత్తగా కనిపించేందుకు కష్టపడుతున్నాడు. కానీ, కమర్షియల్‌గా మాత్రం ఆయనకు అనుకున్న స్థాయిలో బ్రేక్ రాలేదు.

Akhil Akkineni Reviews PEDDI

ముఖ్యంగా 'ఏజెంట్'సినిమా నిరాశపరిచిన తర్వాత అఖిల్ దాదాపు మూడేళ్ల పాటు కొత్త సినిమాను ప్రకటించలేదు. ఈసారి మాత్రం కథల ఎంపికలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని, ప్రస్తుతం 'లెనిన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించారు. ఇందులో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. అక్కినేని నాగార్జునతో కలిసి సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇదిలా ఉంటే, సినిమా ప్రమోషన్లలో భాగంగా అఖిల్ ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. "మీరు 'పెద్ది' సినిమా చూశారా?" అని యాంకర్ ప్రశ్నించగా.. 'అవును.. సినిమా చూశాను. నిజంగా చెప్పాలంటే రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఆయన ఆ పాత్రలో పూర్తిగా జీవించేశారు. సినిమా చూస్తున్నంతసేపూ నాకు రామ్ చరణ్ గారూ అసలు కనిపించలేదు.."అని చెప్పిన అఖిల్, వెంటనే ఒక్కసారిగా ఆగిపోయి నవ్వుతూ.. "రామ్ చరణ్ గారు అంటే నన్ను కొడతాడు .. చరణ్ అంటాను" అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు.

ఇక అఖిల్ మాట్లాడుతూ.. "నిజంగా సినిమా చూస్తున్నప్పుడు నాకు చరణ్ కనిపించలేదు.. ప్రతి సన్నివేశంలో 'పెద్ది' పాత్ర మాత్రమే కనిపించింది. ఒక స్టార్ నటుడు అంటే ఇలాగే ఉండాలి. తన స్టార్ ఇమేజ్‌ను పక్కన పెట్టి పూర్తిగా పాత్రలో లీనమై నటించడం అంత సులభమైన విషయం కాదు. అదే ఒక గొప్ప నటుడి లక్షణం. చరణ్ ఆ పాత్రను అద్భుతంగా మలిచారు" అంటూ ప్రశంసించారు."ఒకే సినిమాలో పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తూ, ప్రేక్షకులు నటుడిని మర్చిపోయేలా చేయడం చాలా అరుదు. 'పెద్ది'లో చరణ్ అదే చేశారు'అని అన్నారు.

ఇదిలా ఉంటే.. రామ్ చరణ్, అఖిల్ అక్కినేని.. ఇద్దరూ మంచి స్నేహితులే కాకుండా, కుటుంబ సభ్యుల్లా ఆప్యాయంగా ఉంటారు. ఒకరి సినిమాలకు, వేడుకలకు మరొకరు హాజరవుతూ పరస్పరం అభినందించుకుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా 'పెద్ది' సినిమాపై మాట్లాడిన అఖిల్.. రామ్ చరణ్ నటనను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తూ, ఆయనపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు.

Read more about: ram charan akhil akkineni peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X