మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ స్పెషల్ పోస్టర్: సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చేశారు
ఏడాది వయసులోనే 'సిసింద్రీ' సినిమా చేసి తనలోని సత్తాను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు అక్కినేని వారసుడు అఖిల్. అప్పుడు ఆకట్టుకున్నప్పటికీ.. హీరోగా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు. 'అఖిల్' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. ఆ తర్వాత 'హలో', 'మిస్టర్ మజ్నూ' వంటి చిత్రాలను చేశాడు. అయితే, ఇవేమీ అతడికి హిట్‌ను అందించలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే మరో రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ సినిమా చేస్తున్నాడు.
అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే మూవీ చేస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏపిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్, వాసువర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల ఇది తరచూ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో సినిమా విడుదల కూడా ఆలస్యం అయింది. దీంతో ఈ మూవీని రీషూట్ చేయాలనకుంటున్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సినిమా నుంచి సర్‌ప్రైజ్ పోస్టర్ రిలీజ్ అయింది.

సంక్రాంతి పండగను పురస్కరించుకుని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' నుంచి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో హీరో అఖిల్‌ను హీరయిన్ పూజా హెగ్డే వెనుక నుంచి హత్తుకుని ఉంది. ఇక, ఈ రొమాంటిక్ పోస్టర్‌లో హీరో విభిన్నమైన లుక్‌లో దర్శనమిస్తున్నాడు. మరోవైపు ఈ పోస్టర్‌లోనే సినిమాను సమ్మర్‌లో విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా టీజర్, పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక, ఈ మూవీలో ఈషారెబ్బ, ఆమని, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, ప్రగతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చాడు.


Click it and Unblock the Notifications











