స్టైలిష్‌గా అఖిల్.. మిస్టర్ మజ్ను రిలీజ్ ఎప్పుడంటే..
అక్కినేని నటవారసుడు అఖిల్ హీరోగా మిస్టర్ మజ్ను అనే చిత్రాన్ని తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంటున్నది.
దీపావళి పర్వదినం సందర్భంగా నవంబర్ 7న ఈ చిత్రానికి సంబంధించి అఖిల్ కొత్త స్టిల్‌ను, పోస్టర్‌ను విడుదల చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఇంకా ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: థమన్, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంల: వెంకీ అట్లూరి.


Click it and Unblock the Notifications











