సీనియర్ డైరెక్టర్‌తో అక్కినేని అఖిల్ సినిమా: ఆ సీక్వెల్ పూర్తయిన తర్వాత పట్టాలపైకి

బుల్లి వయసులోనే 'సిసింద్రీ' అనే సినిమాలో టైటిల్ రోల్ చేసి ఔరా అనిపించాడు అక్కినేని వారసుడు అఖిల్. ఇది వచ్చిన చాలా ఏళ్లకు 'అఖిల్' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అయితే, ఇది మాత్రం డిజాస్టర్ అయింది. దీని తర్వాత అతడు 'హలో', 'మిస్టర్ మజ్నూ' వంటి సినిమాల్లో నటించాడు. కానీ, ఇవేమీ ఈ యంగ్ హీరోకు విజయాన్ని అందించలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో బొమ్మరిల్లు భాస్కర్‌తో కలిసి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌లర్' అనే సినిమా చేశాడు. ఇది విడుదల కాకముందే మరో సినిమానూ లైన్‌లో పెట్టాడు. ఇప్పుడు ఇంకో చిత్రాన్ని ఓకే చేశాడట.

హిట్ కోసం పరితపిస్తోన్న అక్కినేని అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది ఇటీవలే ప్రారంభం అయింది. ఇంతలోనే ఈ యంగ్ హీరో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమాను చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను సీనియర్ డైరెక్టర్ కృష్ణ వంశీ రూపొందిస్తున్నాడట. ఫస్ట్ సిట్టింగ్‌లోనే వీళ్ల మధ్య చర్చలు సఫలం అయ్యాయని తెలిసింది. ప్యూర్ లవ్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుందని అంటున్నారు.

Akhil Akkineni - Srinu Vaitla Combo Under Mythri Movie Makers

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వెలువడినప్పటికీ.. ఈ సినిమా మాత్రం ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీనికి కారణం ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డితో సినిమా చేస్తున్నాడు. అలాగే, శ్రీను వైట్ల కూడా మంచు విష్ణుతో 'ఢీ' మూవీకి సీక్వెల్ చేస్తున్నాడు. ఈ రెండు అయిన తర్వాతనే కొత్త ప్రాజెక్టు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట. అటు ఇటుగా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా పట్టాలెక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇది శ్రీను వైట్ల శైలిలో ఉంటూనే కొత్త లవ్ స్టోరీతో రూపొందనుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X