అఖిల్ ఆల్బమ్‌లో భద్రంగా సమంత ఫోటో.. వదినపై ఇంత అభిమానమా!
ప్రస్తుతం సమంత - రాజ్ నిడిమోరు వ్యవహారం టాలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. రాజ్‌తో సమంత రిలేషన్‌లో ఉన్నారని రేపో మాపో శుభవార్త చెబుతారంటూ సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది. అలాంటిదేమీ లేదు మేమిద్దరం ఫ్రెండ్స్ అని సమంత, రాజ్ చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకునేలా లేరు. పరిస్ధితి చూస్తుంటే వీరిపై ఎప్పుడు, ఎలాంటి వార్తలు వస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ వ్యవహారం మధ్యలో సమంత మాజీ భర్త నాగచైతన్య తమ్ముడు అఖిల్ అక్కినేని వచ్చి చేరాడు. ఈ వివరాల్లోకి వెళితే..
చైతూ గుర్తులు చెరిపేస్తోన్న సమంత
ఏమాయ చేశావే సమయంలో ప్రేమలో పడి నాలుగేళ్లు డేటింగ్ చేసి పెళ్లి చేసుకుని మరో నాలుగేళ్లు కాపురం చేసి విడిపోయారు సమంత - నాగచైతన్య. ఈ జనరేషన్‌లో తెలుగునాట స్టార్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట అర్ధాంతరగా విడిపోవడం అక్కినేని అభిమానులతో పాటు చాలా మందిని బాధించింది. పెళ్లి చేశాక కూడా వీరిద్దరూ కలిసి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. కానీ అనూహ్య కారణాలతో వీరి దారులు వేరయ్యాయి. విడాకులకు ముందే తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుంచి నాగచైతన్యను అన్ ఫాలో చేసిన సామ్.. తన మాజీ భర్త తాలుకా ఫోటోలు, వీడియోలను డిలీట్ చేసింది. చివరికి చైతూపై ప్రేమతో వేయించుకున్న టాటూను కూడా చెరిపేసింది.

చైతూతో విడిపోయినా అక్కినేని ఫ్యామిలీతో టచ్‌లోనే
నాగచైతన్యతో విడిపోయినప్పటికీ అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్‌పై ఏనాడూ పళ్లెత్తు మాట కూడా అనలేదు సమంత. వారందరీ సోషల్ మీడియా ఖాతాలను నేటికీ ఫాలో అవుతున్నారు సామ్. ముఖ్యంగా చైతన్య తమ్ముడు అఖిల్ అంటే సమంతకు ఎంతో అభిమానం. గతంలో అఖిల్ పుట్టినరోజు సందర్భంగా అతనికి బర్త్ డే విషెస్ తెలియజేయడంతో పాటు మంచి విజయాలు సాధించి హిట్లతో దూసుకుపోవాలని పోస్ట్ చేసింది. దీనికి అఖిల్ స్పందించకపోయినా అక్కినేని అభిమానులు మాత్రం సంబరాలు చేసుకున్నారు.
సమంతకు అండగా నిలిచిన అఖిల్
అయితే ఆ తర్వాత సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధిన బారినపడినట్లు స్వయంగా ప్రకటించింది. ఆ సమయంలో సామ్‌కు సినీ ప్రముఖులు, అభిమానులు అండగా నిలిచారు. త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు. తన వదిన అనారోగ్యంపై అఖిల్ కూడా అప్పట్లో స్పందించాడు. అందరి ప్రేమ, అభిమానాలే తోడుగా నీకు బలాన్ని ఇస్తాయని పోస్ట్ కూడా పెట్టాడు. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అలాగే సమంత- నాగచైతన్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా అఖిల్ అండగా నిలిచాడు.
వదినపై అభిమానం చాటుకున్న అఖిల్
తాజాగా వదినపై తన అభిమానాన్ని చాటుకున్నాడు అఖిల్. విడాకుల తర్వాత సమంత ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించాడు చైతన్య. కానీ అఖిల్ మాత్రం తన అన్న వదినలతో దిగిన ఫోటోను అపురూపంగా దాచుకున్నాడు. సమంత - చైతన్యల పెళ్లిరోజు సందర్భంగా అక్టోబర్ 6, 2019 నాడు అఖిల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విష్ చేశాడు. ఈ సందర్భంగా సమంత, చైతూలతో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. చైతన్య - సమంతలు విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ అప్పటి ఫోటోను ఇంకా తన ఇన్‌స్టాగ్రామ్ ఆర్కైవ్స్‌లోనే ఉంచేశాడు అఖిల్. ప్రస్తుతం రాజ్ నిడిమోరు- సమంత రిలేషన్‌పై ఊహాగానాలు వినిపిస్తున్న వేళ ఈ పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత అంటే అఖిల్‌కు ఎంత ఇష్టమో.. నీ దగ్గర ఈ పోస్ట్ ఇంకా ఉందా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











