Just In
Don't Miss!
- Finance
మళ్లీ రూ.49,000కి పసిడి, బంగారం ధరలు మరింత పెరుగుతాయా?
- News
షాక్: ఆయన గెలిస్తే ఉపఎన్నిక తప్పదు -కరోనాతో కాంగ్రెస్ అభ్యర్థి మాధవ రావు మృతి -శ్రీవిల్లిపుత్తూరులో విషాదం
- Sports
IPL 2021: బిగ్ పిక్చర్: నైట్ రైడర్స్‌పై సన్‌రైజర్స్ ట్రాక్ రికార్డ్ ఇదే: కలిసి రాని చెన్నై పిచ్
- Lifestyle
Ugadi 2021: ఉగాది శుభాకాంక్షలు ఇలా చెబితే.. మీ సన్నిహితులు చాలా సంతోషిస్తారు...
- Automobiles
మలేసియాలో విడుదలైన 2021 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్; పూర్తి వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అఖిల్ - సురేందర్ రెడ్డి టైటిల్ పోస్టర్ రిలీజ్: ఊరమాస్ లుక్‌తో అక్కినేని హీరో.. రిలీజ్ డేట్ కూడా
హీరోగా పరిచయమై చాలా కాలమే అవుతోన్న ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా దక్కించుకోలేకపోయాడు అక్కినేని వారసుడు అఖిల్. వీవీ వినాయక్ తెరకెక్కించిన 'అఖిల్'తో హీరోగా పరిచయం అయిన అతడు.. ఆ తర్వాత 'హలో', 'మిస్టర్ మజ్నూ' వంటి సినిమాలు చేశాడు. ఇవేమీ ఈ అక్కినేని హీరోకు హిట్ రుచిని చూపించలేదు. అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడీ యంగ్ హీరో. ఈ క్రమంలోనే స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఓ సినిమాను చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. తాజాగా ఆ మూవీ నుంచి టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటిస్తోన్న సినిమాకు 'ఏజెంట్' అనే టైటిల్‌ను పెట్టారు. ఈరోజు ఈ అక్కినేని హీరో పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితమే విడుదల చేసింది. ఇందులో పొడవాటి జుట్టుతో ఉన్న అఖిల్.. సిగరెట్ కాల్చుతూ ఊరమాస్ లుక్‌తో దర్శనమిస్తున్నాడు. దీంతో ఈ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. ఫలితంగా ఇది కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, ఇదే రోజు ఈ సినిమా నుంచి మరో పోస్టర్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

స్పై థ్రిల్లర్‌గా రాబోతున్న 'ఏజెంట్'లో అఖిల్ SPF ఏజెంట్‌గా నటిస్తున్నాడు. అలాగే, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ స్పై ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. వీళ్లతో పాటు ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇక, ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. చాలా కాలం తర్వాత వక్కంతం వంశీ రచయితగా మారి కథను అందిస్తున్నాడు. థమన్ సంగీతం సమకూర్చబోతున్నాడు. ఇక, ఈ సినిమా డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.