సరికొత్త లుక్‌లో అక్కినేని హీరో: అఖిల్ కొత్త సినిమా మొదలయ్యేది అప్పుడే

'అఖిల్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు అక్కినేని వారసుడు అఖిల్. హ్యాండ్సమ్‌ లుక్స్‌తో పాటు యాక్టింగ్‌లోనూ రాణించినప్పటికీ అతడి మొదటి సినిమా నిరాశనే మిగిల్చింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఇది మాత్రమే కాదు.. దీని తర్వాత అఖిల్ నటించిన 'హలో', 'మిస్టర్ మజ్నూ' వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అతడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం ఎన్నో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం అఖిల్.. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తోన్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే మూవీ చేస్తున్నాడు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏపిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసువర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల ఇది తరచూ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో సినిమా విడుదల కూడా ఆలస్యం అయింది. దీంతో ఈ మూవీని రీషూట్ చేయాలనకుంటున్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అఖిల్ కొత్త సినిమా గురించి ఓ ఆసక్తికర న్యూస్ లీక్ అయింది.

Akhil Akkineni - Surender Reddy Movie Stars from This Date

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' పట్టాలపై ఉండగానే అక్కినేని అఖిల్.. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. స్పై థ్రిల్లర్ కథతో రూపొందనున్న ఈ సినిమాలో అతడు పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడట. ఇక, ఈ సినిమా పూజా కార్యక్రమం ఫిబ్రవరి మొదటి వారంలో జరగనుందని తెలుస్తోంది. అలాగే, రెగ్యూలర్ షూటింగ్ కూడా రెండు రోజుల వ్యవధిలోనే ప్రారంభం కాబోతుందని అంటున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరికొత్త లుక్‌లో దర్శనమివ్వబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇందులో హీరోయిన్‌గా కన్నడ పిల్ల రష్మిక మందన్నా పేరు వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X