‘కనులు కనులు దోచాయంటే’పై అఖిల్.. దుల్కర్‌కు సెల్యూట్ అంటూ ట్వీట్
మళయాల స్టార్ హీరో మమ్ముట్టి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులను మహానటి చిత్రంతో పలకరించాడు. అందులో సావిత్రి భర్త జెమినీ గణేషన్ పాత్రను అద్భుతంగా పోషించి.. అందరికీ దగ్గరయ్యాడు. అయితే మళ్లీ తెలుగు సినిమాలో కనిపించకపోయినా.. డబ్బింగ్ చిత్రాలతో అప్పుడప్పుడు పలకరిస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన హీరోగా, రీతూ వర్మ హీరోయిన్‌గా కనులు కనులు దోచాయంటే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
మౌత్ టాక్ బాగానే ఉన్నా.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నా కనులు కనులు దోచాయంటే.. జనాల్లో మాత్రం అంతగా రీచ్ కాలేదు. కమర్షియల్‌గా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో పాటే రిలీజైన హిట్ చిత్రం ధాటికి పూర్తిగా కనబడకుండా పోయింది. అయితే సినిమా ఓ మంచి ఫీల్‌ను కలిగిస్తుందన్న టాక్ రావడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయం.

తాజాగా ఈ మూవీపై అఖిల్ అక్కినేని కామెంట్ చేశాడు. కనులు కనులు దోచాయంటే గురించి మంచి టాక్ వింటున్నా.. కంగ్రాట్స్ దుల్కర్.. నువ్వు వచ్చే కంటెంట్‌కు సెల్యూట్.. సినిమా చూడాలని ఆత్రుతగా ఉన్నా.. అందరూ వెళ్లి చూడండి' అని ట్వీట్ చేశాడు. అఖిల్ ప్రస్తుతం బ్యాచ్‌లర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











