Akhil Akkineni Wedding: ఘనంగా అఖిల్ - జైనబ్‌ల వివాహం.. తమ్ముడి పెళ్లిలో చైతూ స్టెప్పులు.. అతిథులు వీరే
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని - జైనబ్ రవ్జీల వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నాగార్జున నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు వీరి వివాహం జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. నాగార్జున ఆప్తమిత్రుడు, మరో అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ - ఉపాసన దంపతులు, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో సుమంత్, శోభిత- నాగచైతన్య దంపతులు తదితరులు అఖిల్ - జైనబ్‌ల పెళ్లికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

వివాహానికి ముందు కారును స్వయంగా నడుపుకుంటూ వేదిక వద్దకు చేరుకున్నారు అఖిల్ అక్కినేని. ఆయన లోపలికి ఎంట్రీ ఇవ్వగానే బంధుమిత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పెళ్లి బరాత్ ఘనంగా నిర్వహించారు. నాగార్జున, నాగచైతన్య తదితరులు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ సాంప్రదాయబద్ధంగా పంచెకట్టులో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఓ కార్యక్రమంలో అఖిల్ - జైనాబ్‌లు తొలిసారిగా కలుసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి అభిరుచులు కలవడంతో వీరి పరిచయం అనతికాలంలోనే ప్రేమగా మారింది. మీడియాకు దూరంగా, ఎవరికీ దొరక్కుండా గుట్టుగా తమ ప్రేమాయాణాన్ని సాగించిన వీరిద్దరూ గతేడాది పెద్దల అంగీకారంతో సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని అభిమానులకు షాకిచ్చారు. ఆ సమయంలో నాగచైతన్య - శోభితల వివాహ ఏర్పాట్లలో అక్కినేని ఫ్యామిలీ బిజీగా ఉండటంతో అఖిల్ - జైనాబ్‌ల పెళ్లిని పెద్దలు కొద్దినెలలు వాయిదా వేశారు.
నాగార్జున చిన్నకోడలు జైనబ్ రవ్జీది వ్యాపార కుటుంబం. ఈమె తండ్రి జుల్ఫీ రవ్జీ పెద్ద వ్యాపారవేత్త .. హైదరాబాద్‌లోనే పుట్టిన జైనాబ్.. ముంబైలో స్థిరపడింది. ముంబై, దుబాయ్, లండన్‌లో ఆమె చదువుకున్నారు. ఈమెలో మంచి పెయింటర్ కూడా ఉంది. నటిగానూ ఎంట్రీ ఇచ్చింది. నాగార్జునకు జుల్ఫీ రవ్జీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరి స్నేహం కూడా అఖిల్ - జైనాబ్‌ల పెళ్లికి దోహదం చేసిందని ఇండస్ట్రీ టాక్.
అఖిల్- జైనాబ్‌ల వివాహం జరిగిన నాటి నుంచి వీరి పెళ్లెప్పుడు? ఇండియాలో చేసుకుంటారా? లేక ఫారిన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారా? అంటూ అక్కినేని అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో విస్తృతంగా డిస్కష్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 6న అఖిల్ - జైనాబ్‌ల పెళ్లికి ముహూర్తం ఖరారైందని వార్తలు రావడంతో అంతా సంతోషించారు. తొలుత హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం జరుగుతుందని వార్తలు రాగా చివరికి నాగార్జున స్వగృహంలోనే పెళ్లి జరగడం విశేషం.
అయితే జూన్ 8న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ అక్కినేని - జైనాబ్‌ల వివాహ రిసెప్షన్ జరగనుంది. గ్రాండ్‌గా జరగనున్న ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, పారిశ్రామిక తదితర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తదితరులకు నాగార్జున స్వయంగా ఇన్విటేషన్ కార్డ్స్ అందజేసి కార్యక్రమానికి ఆహ్వానించారు.


Click it and Unblock the Notifications











