అఖిల్ ‘ఏజెంట్’ మూవీలో హాలీవుడ్ రేంజ్ సీన్: ఒక్కదాని కోసమే ఆ బ్రిడ్జ్ దగ్గరకు పయనం

'అఖిల్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయ్యాడు అక్కినేని వారి వారసుడు అఖిల్. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దారుణమైన ఫలితాన్ని చవి చూసింది. దీంతో భారీ నష్టాలు ఎదురయ్యాయి. దీని తర్వాత ఈ యంగ్ హీరో 'హలో', 'మిస్టర్ మజ్నూ' వంటి చిత్రాల్లోనూ నటించాడు. కానీ, ఇవేమీ అతడికి విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో ఈ అక్కినేని హీరో సక్సెస్ కోసం మరింత కాలం వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఈ యంగ్ హీరో కనిపిస్తున్నాడు.

చాలా కాలంగా వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న అక్కినేని అఖిల్.. కొద్ది రోజుల క్రితం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే చిత్రాన్ని చేశాడు. ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా నటించింది. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తి చేసుకున్నా కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలోనే దీన్ని అక్టోబర్ 15న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' విడుదల కాకముందే అక్కినేని అఖిల్.. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఇందులో అక్కినేని అఖిల్ రా ఏజెంట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అతడు ఎన్నో విద్యల్లో శిక్షణను కూడా తీసుకున్నాడు. అదే సమయంలో ఫిజిక్‌ విషయంలోనూ వైవిధ్యంగా తయారయ్యాడు. ఇక, ఇటీవలే అతడి బాడీని చూపిస్తూ రెండు పోస్టర్లను విడుదల చేశారు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో పరోక్షంగా చెప్పారు. ఫలితంగా దీనిపై ఆదిలోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Akhil Akkineni will go Budapest for Agent Movie

యాక్షన్ బ్యాగ్‌డ్రాప్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఏజెంట్' మూవీ షూటింగ్ నెల్లూరు, విశాఖపట్నం పోర్టుల్లో జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోనూ ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. తాజా సమాచారం ప్రకారం.. త్వరలోనే ఈ మూవీ యూనిట్ హంగేరీలోని బుడాపెస్ట్‌కు వెళ్లబోతుందట. అక్కడి ఫేమస్ బ్రిడ్జ్ మీద ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. ఇక, ఈ ఎపిసోడ్ హాలీవుడ్ మూవీల్లోని సన్నివేశాలను మరిపించేలా డిజైన్ చేశారని తెలుస్తోంది. దీని కోసం విదేశాలకు చెందిన టెక్నీషియన్లు పని చేయబోతున్నారనే టాక్ కూడా జోరుగానే వినిపిస్తోంది.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'ఏజెంట్' మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత, డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్‌హాప్ తమీజా సంగీతం సమకూర్చుతున్నాడు. స్పై థ్రిల్లర్‌గా రాబోతున్న 'ఏజెంట్' యాక్షన్ మూవీలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్నట్లు ఆరంభంలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయనను కాదని అదే పరిశ్రమకు చెందిన మమ్ముట్టిని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై చిత్ర యూనిట్ స్పందించలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X