Lenin Title Glimpse Review: లెనిన్ తెలుగు మూవీ టైటిల్ గ్లింప్స్.. అఖిల్ స్టన్నింగ్, పవర్‌పుల్ స్టోరీతో!
తెలుగు సినిమా రంగంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లెనిన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. యువ హీరో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు నాగార్జున అక్కినేని, నాగవంశీ నిర్మాతలుగా వహిస్తున్నారు. ఈ సినిమాకు వినరో భాగ్యం విష్ణు కథ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వం వహించారు. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ వివరాల్లోకి వెళితే..
అఖిల్ పుట్టిన రోజును పురస్కరించుకొని తన కెరీర్‌లో ఆరో చిత్రంగా లెనిన్ రూపొందింది. ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదు అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ సినిమా గ్లింప్స్ చూస్తే.. లవ్, యాక్షన్, రొమాన్స్, డివోషనల్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్టు అర్ధమైంది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవబోతుందని కాస్త రుచి చూపించారు. నవీన్ కుమార్ సినిమాటోగ్రఫి, నవీన్ నూలి ఎడిటింగ్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా అస్సెట్ కాబోతున్నదని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తన ప్రతిభను గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు.

లెనిన్ చిత్రం పక్కా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో పూర్తి స్థాయి యాక్షన్ ప్యాక్డ్ సినిమాగా తెరకెక్కుతున్నది. పురాణాల బ్యాక్ డ్రాప్‌తో అధ్యాత్మిక అంశాలు జొప్పించిన చిత్రంగా గ్లింప్స్ కనిపించింది. ఈ సినిమాకు లెనిన్ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పెట్టడంతో పాజిటివ్ వైబ్ కనిపించింది. లెనిన్ గ్లింప్స్‌తో ఈసారి అఖిల్ సక్సెస్‌పై పెట్టిన గురి తప్పదు అనే భావన కలిగించింది. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడం ఖాయమని అనిపించింది.
శ్రీలీల నటించిన లెనిన్ మూవీ గ్లింప్స్ విషయానికి వస్తే.. పవర్‌ఫుల్ డైలాగ్‌తో ఆసక్తిని, అంచనాలను పెంచారు. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటుంది రా, పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది అని మా నాయన చెప్పేవారు. రాయలసీమ యాసలో అఖిల్‌తో డైలాగ్స్ చెప్పించిన విధానం చూస్తే.. ఈ సినిమా ద్వారా కొత్త అఖిల్‌ను చూడబోతున్నామనే గట్ ఫీలింగ్ కలిగించింది.
ఇక లెనిన్ టైటిల్ పాత్రను పోషిస్తున్న అఖిల్ అక్కినేనికి ఈ సినిమా అగ్నిపరీక్షగా మారింది. తప్పనసరిగా హిట్ కొట్టాల్సిన క్రమంలో తన వేషం, భాష మార్చుకొని శక్తిమంతమైన పాత్రలో కనిపించారు. గ్లింప్స్‌లోనే తన బాడీ లాంగ్వేజ్, క్యారెక్టర్ యాటిట్యూడ్, లుక్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని స్పష్టం చేశారు. డిఫరెంట్ స్క్రీన్ ప్రజెన్స్‌తో పాత అఖిల్‌ను మరిపించేలా ఈ సినిమా కథను ఎంచుకొన్నట్టు స్పష్టమైంది.

అఖిల్ కెరీర్‌లో ఇప్పటి వరకు వచ్చిన సినిమా కథలకు భిన్నంగా లెనిన్ ఉండబోతుందనేది ఖాయంగా కనిపిస్తున్నది. అఖిల్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై అటు అక్కినేని ఫ్యాన్స్‌లోను, ఇండస్ట్రీ వర్గాల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. హై రేంజ్ అంచనాలను లెనిన్ దాటుతుందా? అనే ప్రశ్నకు టైటిల్ రివీల్ గ్లింప్స్ కొంత సమాధానం ఇచ్చింది. ట్రైలర్, సినిమా మిగితా సందేహాలను పటాపంచలు చేస్తుందని అశించాలి.


Click it and Unblock the Notifications











