‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ రిలీజ్ డేట్ ఫిక్స్: ఆ స్పెషల్ డేకు రెండు రోజుల ముందే

'అఖిల్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయ్యాడు అక్కినేని వారి వారసుడు అఖిల్. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం భారీ డిజాస్టర్‌ అయింది. ఆ వెంటనే 'హలో' అనే సినిమాతో అతడు రీ లాంచ్ అయ్యాడు. అయితే, ఇది కూడా నిరాశనే మిగిల్చింది. దీని తర్వాత 'మిస్టర్ మజ్నూ' అనే సినిమాలో నటించాడు. ఇక, ఈ చిత్రం కూడా ఆకట్టుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమా చేశాడు. చాలా రోజులుగా దీని విడుదలకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్న విషయం తెలిసిందే.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటించిన చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. ఈ మూవీ షూటింగ్ పూర్తైయి చాలా కాలమే అవుతోంది. కానీ, గత ఏడాది లాక్‌డౌన్ కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వాయిదా పడ్డాయి. ఇక, ఇవన్నీ పూర్తి చేసుకుని విడుదల చేద్దామనుకోగా.. ఈ సంవత్సరం కరోనా రెండో దశ వల్ల అది సాధ్యం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డేకు రెండు రోజుల ముందు అంటే ఆగస్టు 13న విడుదల చేయాలని యూనిట్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని ఓ న్యూస్ ఫిలిం నగర్‌ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Akhil Akkinenis Most Eligible Bachelor Release on August 13th

ఎన్నో ఆశల నడుమ రాబోతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' నుంచి ఇప్పటికే పలు పోస్టర్లు, పాటలు, టీజర్ విడుదలయ్యాయి. వీటన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫలితంగా సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకే దీనికి ఓటీటీ ఆఫర్లు వచ్చినా చిత్ర యూనిట్ తిరస్కరించిందని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీ సుందర్ సంగీతం అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X