‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ షూట్ ఇంకా పూర్తవలేదా: షాకిస్తోన్న అఖిల్ మూవీ అప్‌డేట్

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలుగా పరిచయం అవుతుంటారు. కానీ, వారిలో కొందరు మాత్రమే సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌లను ముందుకు తీసుకెళ్తున్నారు. మిగిలిన వారిలో చాలా మంది ఒడిదుడుకులనే ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిలో అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్. చాలా రోజుల క్రితమే 'అఖిల్' అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడికి నిరాశనే ఎదురైంది. ఆ తర్వాత కూడా 'హలో', 'మిస్టర్ మజ్నూ' వంటి చిత్రాలను చేశాడు. కానీ.. హిట్ మాత్రం దక్కలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లా రాబోతున్నాడు.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తోన్న చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ వాయిదా పడుతూ రావడంతో చిత్రీకరణ బాగా ఆలస్యం అయింది. దీని ప్రభావం విడుదల పైనా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని ఆటంకాలనూ దాటుకుని ఈ సినిమాను జూన్ 15న రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ, కరోనా వైరస్ ప్రభావం అది కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అఖిల్ సినిమా గురించి ఊహించని న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

Akhil Akkinenis Most Eligible Bachelor Shooting Update

తాజా సమాచారం ప్రకారం.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదట. దీనికి నాలుగు రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని తెలిసింది. ఇందులో ఓ ఫైట్ సీన్‌తో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉందని అంటున్నారు. ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి అందరూ షాకవుతున్నారు. అదే సమయంలో మళ్లీ రీషూట్ చేస్తున్నారా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీ సుందర్ సంగీతం సమకూర్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X