అఖిల్ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్: ఏ జిందగీ అంటున్న అక్కినేని హీరో
హీరోగా పరిచయం అయినప్పటికీ ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు హ్యాండ్సమ్ హీరో అక్కినేని అఖిల్. 'అఖిల్' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. ఆ తర్వాత 'హలో', 'మిస్టర్ మజ్నూ' వంటి చిత్రాలను చేశాడు. అయితే, ఇవేమీ అతడికి హిట్‌ను అందించలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా విజయాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం 'బొమ్మరిల్లు', 'పరుగు' వంటి చిత్రాలను తెరకెక్కించిన భాస్కర్‌తో జత కట్టాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది.
అక్కినేని అఖిల్ - బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. భారీ ఆశల నడుమ రాబోతున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీ కూడా ఎంతో సుందరంగా రెడీ అవుతోంది. ఇక, ఇప్పటి వరకూ విడుదలైన ప్రతి పోస్టర్, పాట, టీజర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని 'ఏ జిందగీ' అనే పాట రాబోతుంది. ఏప్రిల్ 5న దీన్ని రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో అక్కినేని అభిమానులు దీని కోసం వేచి చూస్తున్నారు.

అఖిల్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్, వాసు వర్మ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో ఈషా రెబ్బా, ఆమని, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, ప్రగతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక, ఇది జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇది వరకే ప్రకటించింది.


Click it and Unblock the Notifications











