అఫీషియల్.. అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ మూవీ టైటిల్ అదే
అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌కు కాలం కలిసి రావడం లేదు. చేసిన మూడు సినిమాలు కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. కెరీర్‌లో మొదట్లో బొమ్మరిల్లు, పరుగు వంటి చిత్రాలతో హిట్ కొట్టిన దర్శకుడు మరో విజయాన్ని అందుకోలేకపోయాడు. అలాంటి హీరో, ఇలాంటి దర్శకుడు కలిసి ఓ చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్.. కలిసి చేస్తోన్న మూవీ అప్‌డేట్ తాజాగా వచ్చింది.
విజయం అనేది అందని ద్రాక్షలా మారిన వీరిద్దరు కలిసి చేస్తోన్న ఈ మూవీ టైటిల్‌ను నేటి సాయంత్రం విడుదల చేశారు. అయితే కొన్ని నెలల క్రితమే ఈ సినిమా టైటిల్‌పై రూమర్స్ వినిపించాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అన్నది ఆ టైటిల్. అయితే అప్పట్లో ఇది మరీ పెద్ద టైటిల్ అని ఒకపక్క, విజయ్ దేవర కొండ వరల్డ్ ఫేమస్ లవర్ ను ఇమిటేట్ చేసినట్లు వుంటుంది అని ఇంకో పక్క కామెంట్లు వినిపించాయి.

అయితే అలాంటి కామెంట్లను లెక్కలోనికి తీసుకోలేదని తెలుస్తోంది చిత్రయూనిట్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటూ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. బ్యాచిలర్ అనేది మెయిన్ టైటిల్‌గామోస్ట్ ఎలిజిబుల్ అనేవి ప్రీ క్యాప్షన్‌గా ఇచ్చారు. ఫిబ్రవరి 8న సాయంత్రం 6.18గంటలకు మొదటి అడుగు వేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











