‘బ్యాచ్‌లర్’ వచ్చేది ఆ రోజే.. రొమాంటిక్ మూడ్‌లో అఖిల్, పూజా హెగ్డే
టాలీవుడ్‌లో ప్రస్తుతం దర్శకనిర్మాతలు హీరోలు అందరూ కూడా తమ తమ సినిమాలకు విడుదల తేదీలను ఫిక్స్ చేసుకున్నారు. వచ్చే సంక్రాంతికి ఇప్పుడే రిజర్వ్ చేసుకున్నారు. అయితే కొంత మంది మాత్రం ఇంకా ముందుకు కదలడం లేదు. అందులో రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ చిత్రాలు ఉండేవి. ప్రస్తుతం సెట్స్ మీదున్న అన్ని సినిమాలు కూడా విడుదల తేదీలను ప్రకటించి డేట్లను బుక్ చేసేసుకున్నాయి.
తాజాగా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమా కూడా తమ బెర్తును ఫిక్స్ చేసుకుంది. అయితే అన్ని సినిమాల రిలీజ్ డేట్లను బాగా పరిశీలించి.. పోటీ లేకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో జూన్‌లో రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. ఇంత వరకు వచ్చిన అప్డేట్లలో ఏ ఒక్క చిత్రం కూడా జూన్‌లో రిలీజ్ కావడం లేదు. కానీ బ్యాచ్‌లర్ సినిమా మాత్రం జూన్‌లోనే ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయింది.

జూన్ నెల అంతా కూడా పిల్లల చదువులు, స్కూళ్లు, కాలేజీల ప్రారంభమంటూ బిజీగా ఉంటారని ఎవ్వరూ కూడా జూన్‌ను టచ్ చేయలేదు. కానీ బ్యాచ్‌లర్ మాత్రం ఆ సాహసం చేశాడు. జూన్ 19న రాబోతోన్నామని చిత్రయూనిట్ కాసేపటి క్రితమే ప్రకటించారు. ఈ మేరకు ఓపోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పూజా హెగ్డే, అఖిల్ ఇద్దరూ కూడా మంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ మూవీతో అయినా బొమ్మరిల్లు భాస్కర్ హిట్టు కొట్టాలని ట్రై చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











