Akhil Raj: ముదిరిన గొడవ.. హీరో అఖిల్ రాజ్‌కు ఊహించని షాక్.. రంగంలోకి పోలీసులు!

Akhil Raj: 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు అఖిల్ రాజ్ ఉద్దెమరి. ఈ యంగ్ హీరో చుట్టూ నెలకొన్న వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. తొలుత ఒక రాంగ్ డెలివరీతో ప్రారంభమైన చిన్న గొడవ.. ఇప్పుడు పోలీసు కేసులు, సోషల్ మీడియా ఆరోపణలు, అతడి కారుపై దాడి వరకు వెళ్లింది. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

రాంగ్ డెలివరీతో మొదలైన వివాదం
గత నెల 28న కొండాపూర్‌లోని శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న నటుడు అఖిల్ రాజ్ ఇంటికి రమేశ్ అనే ఫుడ్ డెలివరీ బాయ్ పొరపాటున ఒక నాన్-వెజ్ ఫుడ్ పార్సిల్‌ను డెలివరీ చేశాడు. వాస్తవానికి ఆ పార్సిల్ ఎదురుగా ఉన్న మరో అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌కు వెళ్లాల్సి ఉండగా, ఆ డెలివరీ బాయ్ అడ్రస్ సరిగా నిర్ధారించకుండా అఖిల్ ఇంటికి ఇచ్చినట్లు తెలుస్తోంది.

Akhil Raj Controversy Car Attack Attempt After Delivery Boy Dispute Police Probe

ఇంట్లో నలుగురు సభ్యులు ఉండటంతో కుటుంబ సభ్యులు తమలో ఎవరైనా ఆర్డర్ చేసి ఉంటారని భావించి పార్సిల్‌ను తీసుకున్నారు. ఆ విషయం తెలియని అఖిల్ తల్లి ప్యాకెట్‌ను కూడా తెరిచారట. కొంతసేపటి తర్వాత డెలవరీ బాయ్ తన పొరపాటును గుర్తించి,తిరిగి అఖిల్ రాజ్ ఇంటికి వచ్చి పార్సిల్‌ను అడిగినట్టు తెలుస్తోంది. ఇక్కడే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది.

ఈ ఘటనపై ఇరు వర్గాలు వేర్వేరు కథనాలు చెబుతున్నాయి. డెలివరీ బాయ్ రమేశ్ వాదన ప్రకారం.. తాను పొరపాటును గుర్తించి క్షమాపణ చెప్పినా, అఖిల్ రాజ్ తీవ్ర ఆగ్రహంతో తనపైకి దూసుకొచ్చారని, కొట్టడానికి ప్రయత్నించారని ఆరోపించాడు. అంతేకాదు, అఖిల్ తల్లి తన ముఖంపై ఉమ్మివేసి అవమానించిందని ఆరోపిస్తున్నారు. అయితే నటుడు అఖిల్ రాజ్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు.

పార్సిల్‌ను అడిగే సమయంలో డెలివరీ బాయ్ రమేశ్ దురుసుగా మాట్లాడాడని, తన తల్లిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడంతోనే తాను స్పందించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. "మొత్తం వీడియో కాకుండా కొంత భాగాన్ని మాత్రమే సోషల్ మీడియాలో పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించారు.నా వైపు నిజం కూడా వినాలి" అని అఖిల్ రాజ్ పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. డెలివరీ బాయ్‌కు మద్దతుగా పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేయగా, కొంతమంది అఖిల్ రాజ్ వైఖరిని తప్పుబట్టారు. మరోవైపు అఖిల్‌కు మద్దతుగా కూడా పలువురు స్పందించారు. ఈ క్రమంలో కొంతమంది డెలివరీ బాయ్స్ అఖిల్ నివాసం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం.

కారుపై దాడి యత్నం!
అయితే.. ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. మంగళవారం అఖిల్ రాజ్ తన తల్లిదండ్రులతో కలిసి కారులో గుడికి వెళ్తుండగా, డెలివరీ బాయ్ రమేశ్ తన స్నేహితులతో కలిసి కారును అడ్డుకున్నట్లు సమాచారం. కొంతమంది కారును చుట్టుముట్టి రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సమయంలో అఖిల్ రాజ్ కుటుంబం తీవ్ర భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది. అఖిల్ రాజ్ తన కారుపై దాడికి యత్నించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో ఆధారంగా నటుడు నేరుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన ప్రాణాలకు ముప్పు ఉందని ఫిర్యాదు చేశారట.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే స్పందించారు. ఇన్‌స్పెక్టర్ బాలరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని డెలివరీ బాయ్ రమేశ్ తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇరు వర్గాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. పోలీసుల దర్యాప్తు తర్వాతే అసలు నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Read more about: ramesh akhil raj Raju Weds Rambai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X