Agent Loading: భయంకరమైన బాడీతో షాక్ ఇచ్చిన అక్కినేని అఖిల్.. ఇది కదా కావాల్సింది!

అక్కినేని హీరోల్లో ఎవరికి కూడా సక్సెస్ అనేది అంత ఈజీగా రాలేదు. బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన నాగార్జున నుంచి ప్రతి ఒక్కరు కష్టంతోనే హిట్స్ అందుకున్నారు. ఇక హిట్ చూడాల్సిన అఖిల్ కూడా అదే దారిలో చాలా కష్టపడుతున్నాడు. ఇటీవల ఏజెంట్ కు సంబంధించిన ఒక లుక్ విడుదల చేయగా అభిమానులు ఇది కదా కావాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వరుసగా ఫెయిల్యూర్స్

వరుసగా ఫెయిల్యూర్స్

అఖిల్ మొదటి సినిమాతోనే ఊహించని విధంగా డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. ఎంతో నమ్మకంతో చేసిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో యువ హీరో ఒక్కసారిగా నిరాశ చెందాడు. ఇక ఆ తరువాత చేసిన హలో సినిమా కూడా అంతగా వర్కౌట్ కాలేదు. ఇక మూడవ సినిమా మిస్టర్ మజ్ను కూడా అంచనాలను అందుకోలేకపోయింది.

ఆ సినిమాపై కూడా..

ఆ సినిమాపై కూడా..

ఇక బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాపై ప్రస్తుతానికైతే పెద్దగా అంచనాలు అయితే లేవు. విడుదల చేసిన పాట కూడా అంతంతమాత్రంగానే క్లిక్కయ్యింది. కానీ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అఖిల్ నమ్మకంతో ఉన్నాడు. థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత ఆ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది.

ఏజెంట్ లోడింగ్..

ఏజెంట్ లోడింగ్..

ఇక ఆ సినిమా కంటే ఎక్కువగా అఖిల్ ఏజెంట్ సినిమాపైనే నమ్మకం పెట్టుకున్నాడు. సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అఖిల్ సరికొత్త ఫిట్నెస్ తో సిద్ధమయ్యాడు. ఇక రీసెంట్ గా చిత్ర యూనిట్ ఏజెంట్ లోడింగ్ అంటూ అఖిల్ కు సంబంధించిన ఒక ఫొటోను విడుదల చేశారు.

Recommended Video

Shakeela Sensational Comments On Allu Arjun | ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..
ఇది ఆరంభం మాత్రమే

ఇది ఆరంభం మాత్రమే

అఖిల్ ఫుల్ వర్కౌట్స్ తో కండలు గట్టిగానే పెంచాడు. వీపుపై భయంకరమైన టాటూను కూడా వేసుకున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి మాస్ యాక్షన్ కథలను సెట్ చేసుకుంటే.. ఎలివేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ' ఇది ఆరంభం మాత్రమే.. ముందు ఉంది పండగ అంటూ' దర్శకుడు ట్వీట్ కూడా చేశాడు. దీంతో అఖిల్ అసలైన పవర్ఫుల్ సినిమాతో రాబోతున్నాడని అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X