గౌతమ్ వర్సెస్ అకీరా నందన్.. ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందో తెలుసా?

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబులకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారికి ఫ్యాన్స్ కంటే భక్తులే ఎక్కువని చెప్పాలి. అయితే పవన్, మహేశ్ ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం కూడా ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు. ఒకరికొరరు తమ కెరీయర్ లో వ్యక్తిగత విషయాల్లోనూ సహకరించుకుంటూ వచ్చారు. తమ కెరీయర్ లో టాప్ స్టార్లుగా ఎదిగారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్, మహేశ్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని డెబ్యూ ఫిల్మ్స్ కు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఎవరికి ఎంత క్రేజ్ ఉందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

తండ్రిని మించిన తనయులుగా అకీరా, గౌతమ్..
ప్రస్తుతం మహేశ్ బాబు కొడుకు గౌతమ్ ఘట్టమనేని, పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ తమ స్కూలింగ్ ను పూర్తి చేసుకొని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఓవైపు గౌతమ్ ఘట్టమనేని అమెరికాలోని ప్రముఖ యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ తండ్రి వెంటనే కనిపిస్తున్నాడు. ఇక త్వరలో ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ యుక్త వయస్కుడిగా ఉన్నప్పటి పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఏదేమైనా అప్ కమింగ్ జనరేషన్స్ లో వీరిద్దరై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అకీరా, గౌతమ్ లు ఇద్దరూ తండ్రికి మించిన తనయులు అవ్వడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే వారిద్దరికి సోషల్ మీడియాలో క్రేజ్ అంతకంతకు పెరిగిపోతోంది.

Akhira Nandan vs Gautam Ghattamaneni

అకీరా నందన్ వర్సెస్ గౌతమ్ ఘట్టమనేని..
ఇద్దరు స్టార్ కిడ్స్ పైగా పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు కొడుకులు కావడంతో సహజంగానే వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే వీరు ఇద్దరు సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటారు. దీంతో ఎవరికి ఎంత ఫాలోయింగ్ ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా గౌతమ్ కు ఇస్టాలో 3.5 లక్షల మంది ఫాలో అవుతుండగా.. అకీరా నందన్ ను 1.6 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇదిలా ఉంటే.. వీరి బర్త్ డే రోజున గౌతమ్ ఘట్టమనేని 1.83 మిలియన్ల వరకు, అకీరా నందన్ 1.5 మిలియన్ల వరకు సోషల్ మీడియాలో బర్త్ డే ట్రెండ్ ను క్రియేట్ చేశారు. ఈలెక్కన మహేశ్ బాబు తనయుడు గౌతమ్ కు కాస్తా ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటం విశేషం.

వరల్డ్ మార్కెట్ పై మహేశ్ గురి..
చివరిగా మహేశ్ బాబు గుంటూరు కారం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక నెక్ట్స్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 చిత్రంలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీంతో వరల్డ్ మార్కెట్ ను కొల్లగొట్టాలని చూస్తున్నారు.

సెన్సేషన్ గా పవన్ కళ్యాణ్..
ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత హరి హర వీరమల్లు చిత్రంతో పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జూలై 24న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కానుందీ చిత్రం. ఆ తర్వాత సెప్టెంబర్ 25, 2025న ఓజీ చిత్రం రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది 2026 మార్చిలో ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X