అకీరా ఎంట్రీ ఎప్పుడు? పవన్ వారసుడి డెబ్యూపై పాన్ ఇండియా హీరో క్లారిటీ
చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలు తమ పిల్లలను కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని కలలు కంటారు. చిన్నప్పటి నుంచి ఇందుకు అవసరమైన శిక్షణ ఇస్తూ తమ వారసులకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంటారు స్టార్స్. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది స్టార్ కిడ్స్ ఉన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది వారసులు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో కొందరు మాత్రం ప్రత్యేకం. ఈ కోవలోకే వస్తారు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్.
మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడల్లో మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు డజను మంది హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలుగా రాణిస్తున్నారు. ఈ కుటుంబ హీరోల పేరు మీదే ఏటా వందల కోట్ల బిజినెస్ జరుగుతుంది. చిరంజీవి బాటలోనే ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ అగ్రనటుడిగా వెలుగొంది, రాజకీయాల్లోనూ సక్సెస్ అయి ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ప్రస్తుతం పవర్‌స్టార్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరా నందన్- ఆద్యల వెండితెర ప్రవేశంపై రకరకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అకీరా విషయంలో మాత్రం మొదటి నుంచి పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నారు అతని తల్లి రేణు దేశాయ్. యాక్టింగ్, డ్యాన్స్, సంగీతం ఇలా అన్ని రకాలుగా కొడుకుని సిద్ధం చేసింది. ఇక పియానో వాయించడంలో అకీరా స్పెషలిస్ట్ అన్న సంగతి తెలిసిందే. అకీరాను ఇండస్ట్రీకి పరిచయం చేయడం గురించి రోజూ భగవంతుడికి వేడుకుంటున్నట్లుగా ఆమె తెలిపారు. పవన్ నట వారసుడిని గ్రాండ్‌గా లాంచ్ ఛేయాలని అటు మెగా కాంపౌండ్ కూడా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇందుకు అవసరమైన కథ, దర్శకుడు, నిర్మాతలను అన్వేషించే పనిలో మెగా ఫ్యామిలీ ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అటు పవన్ కళ్యాణ్ కూడా అకీరా విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు. పలువురి దర్శకుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఓజీ చిత్రంలో అకీరా ఓ కీలక పాత్ర పోషించినట్లుగా రూమర్స్ రాగా.. ఆ తర్వాత ఇది పుకారుగా మారిపోయింది. శేఖర్ కమ్ముల చేతుల మీదుగా అకీరా లాంచింగ్ ఉంటుందని వార్తలు వచ్చాయి. అనంతరం నటుడు, దర్శకుడు అడివి శేష్ దర్శకత్వంలో అకీరా నందన్‌ను ఇంట్రడ్యూస్ చేయనున్నారని గాసిప్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్‌తో పాటు అకీరాకు కూడా శేష్‌తో మంచి సాన్నిహిత్యం ఉండటమే ఇందుకు కారణం. గతంలో రైటర్స్ బ్లాక్ షార్ట్ ఫిల్మ్‌కు అకీరా సంగీతం అందించగా.. శేష్ అన్నిరకాలుగా అండగా నిలిచారు. అకీరా కోసం వినూత్నమైన కథను శేష్ సిద్ధం చేసినట్లుగా ఫిలింనగర్‌లో ఊహాగానాలు వినిపించాయి.
ప్రస్తుతం డెకాయిట్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అకీరా నందన్ డెబ్యూ గురించి మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవ్వగా దానికి అడివి శేష్ స్పందించారు. అకీరాను అప్పుడప్పుడు కలుస్తాటాం, అతనంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం లెఫ్ట్ హ్యాండర్స్ అన్న పాయింట్‌లో సింక్ అయ్యింది. ఈరోజు అతనికంటే సెపరేట్‌గా క్రేజ్ ఉంది. అందరి మాదిరిగానే నేను కూడా అకీరా డెబ్యూ గురించి వెయిట్ చేస్తున్నా అని అడివి శేష్ తేల్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.


Click it and Unblock the Notifications