Akira Nandan Debut : హీరోగా అకీరా నందన్.! ఎలా ప్లాన్ చేస్తున్నారంటే?

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ తొలిసినిమా ఎప్పుడు ప్రారంభం కాబోతోందనే వార్త ఇప్పుడు ఊపందుకుంది. పవన్ కళ్యాణ్ ఏపీలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఏడాది ముందు నుంచే రాజకీయ కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఓ యుద్ధం చేసిన పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా, పిఠాపురం ఎమ్మెల్యేగా పాలన అందిస్తున్న విషయం తెలిసిందే. రాజకీయంగా జనసేన పార్టీతో తన లక్ష్యాన్ని చేధించారు. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఆయన్ని మళ్లీ వెండితెరపై ఎప్పుడూ చూస్తామోనని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలు భారీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల పవర్ స్టార్ అప్ కమింగ్ ఫిల్మ్స్ నుంచి కూడా అప్డేట్స్ అందుతూనే ఉండటం విశేషం. రీసెంట్ గానే 'హరిహర వీరమల్లు' నుంచి ఓ సాంగ్ విడుదలై ఆకట్టుకుంది.

ఇక.. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవుతున్న తరుణంలో సినిమాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. ఇప్పటి వరకు సెట్స్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ను మాత్రం పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది ఊహించలేం. ఈ క్రమంలో కొడుకు అకీరా నందన్ పై దర్శకనిర్మాతలు ఫోకస్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఎప్పటి నుంచో అకీరా నందన్ డెబ్యూ ఉంటుందని అంటున్నారే గానీ ఎలాంటి అప్డేట్ మాత్రం రాలేదు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం అకీరా త్వరలోనే వెండితెరపై దర్శనమిస్తారని పలు సందర్భాల్లో ఆయా సినీ ఈవెంట్లలో పరోక్షంగా చెబుతున్న విషయం తెలిసిందే.

Akira Nandan Debut film Tollywood Producers Planning This Way

మరోవైపు అకీరా కూడా గతంతో పోల్చితే ఇటీవల కాలంలో ఎక్కువగా బయట కనపిస్తున్నారు. ఫ్యామిలీతో, తండ్రి పవన్ కళ్యాణ్ తోనూ తరుచూగా కనిపిస్తూనే ఉన్నారు. దీంతో పవన్ అభిమానులు అకీరా స్టైల్ ను చూసి ఫిదా అవుతున్నారు. మరోవైపు సినీ పెద్దలు కూడా అకీరా వినయం, ఓపికా, తండ్రి అడుగుజాడల్లో నడిచే గుణాన్ని గమనిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వారసుడిగా అకీరాను త్వరలోనే వెండితెరకు పరిచయం చేయబోతున్నారన్న మాట తెలిసిందే. కానీ ఎప్సుడు? ఎలా? ఎలాంటి జోనర్? అనేది ఇంకా సస్పెన్స్ లోనే ఉంది.

కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ దగ్గరకు పలువురు నిర్మాతలు వెళ్తూ వస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే.. వాళ్లు వెళ్లేంది పవన్ తో సినిమా కోసం కాదని.. అకీరా గ్రాండ్ లాంచ్ కే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇందులో ఎంతమేర వాస్తవం ఉందనేది మున్ముందు చూడాలి. నిర్మాతలు మాత్రం పవన్ కళ్యాణ్ ని ఎలాగైనా ఒప్పించి అకీరాను లాంచ్ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అటు అకీరా కూడా యాక్టింగ్ లో శిక్షణ పొందాల్సి ఉందని.. ఆ వెంటనే డెబ్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ అవుతుందని అంటున్నారు. త్వరలో మాత్రం 'ఓజీ'లో స్పెషల్ అపీయరెన్స్ తో సర్ ప్రైజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X