Akira Nandan కొణిదెల వారసుడు కాదా? మెగా ఫ్యాన్స్‌కు మింగుడుపడని విషయం బయటకు.. !

మెగా ఫ్యామిలీ మొత్తానికి చిరంజీవి మూలస్థంభం లాంటివారు. ఆయన సినీరంగంలో ఎదిగిన తీరు చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ తర్వాత ఆయన సోదరుడు నాగబాబు పవన్ కళ్యాణ్ కూడా సినీ రంగంలోకి ప్రవేశించారు. వీరిద్దరిలో పవన్ కళ్యాణ్ ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మొత్తం మెగా ఫ్యామిలీకి ఎంత క్రేజ్ ఉందో పవన్ కళ్యాణ్ ఒక్కడికే అంత క్రేజ్ ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే పవన్ కళ్యాణ్ వారసుడిగా అకిరా నందన్ ఎప్పుడో తెర మీదకు వచ్చాడు కానీ ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ వారసుడిగా నిలబడతాడా లేదా అనే విషయం మీద చర్చ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

అకీరా నందన్, ఆద్యా

అకీరా నందన్, ఆద్యా


మొదటి విశాఖపట్నానికి చెందిన ఒక యువతిని వివాహమాడిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆమె నుంచి విడిపోయి కొన్నాళ్లపాటు సినిమాల మీద దృష్టి పెట్టారు, అదే సమయంలో రేణు దేశాయ్ పరిచయం కావడంతో ఆమెతో సహజీవనం చేశారు. అయితే రాజకీయాలకు ఇబ్బంది అవుతుందని భావించి ఎట్టకేలకు ఆమెను వివాహమాడారు. అయితే అప్పటికే ఆమెకు పవన్ కళ్యాణ్ ద్వారా అకీరా నందన్, ఆద్యా అనే ఇద్దరు చిన్నారులు కూడా జన్మించారు.

విడాకులు కూడా

విడాకులు కూడా


అయితే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ల మధ్య విభేదాలు రావడంతో వారు విడాకులు కూడా తీసుకున్నారు. అయితే రేణు దేశాయ్ తన పిల్లలను భర్తను విడదీయాలని అనుకోలేదు. అందుకే ఎప్పుడు పవన్ కళ్యాణ్ తన బిడ్డలను చూడాలనుకున్నా, పిల్లలు తమ తండ్రిని చూడాలనుకున్నా ఎలాంటి అడ్డు లేకుండా కలుస్తున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ తో మాత్రమే కాదు రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్ సహా మెగా ఫ్యామిలీ లో అందరితో అకిరా నందన్, ఆద్యలకు మంచి రిలేషన్ ఉంది.

 పవన్ కళ్యాణ్ వారసుడు గానే

పవన్ కళ్యాణ్ వారసుడు గానే


ఈ క్రమంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అకీరా నందన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు గానే భావిస్తున్నాను. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అది ఏమిటి అంటే అకీరా నందన్ పవన్ కళ్యాణ్ వారసుడిగా కాకుండా రేణు దేశాయ్ వారసుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడని, తన తండ్రి ఇంటి పేరు వదులుకుని తల్లి ఇంటి పేరునే స్వీకరించాడు అని తెలుస్తోంది.

అకీరా నందన్ దేశాయ్ అని

అకీరా నందన్ దేశాయ్ అని


ఇటీవల ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలలో అకీరా నందన్ RRR సినిమాలోని దోస్తీ పాటకు పియానో వాయించి అందరినీ ఆకర్షించాడు, అయితే ఇదే సమయంలో ఆయన పాట ప్లే చేస్తున్న క్రమంలో ఆయన పేరు అకీరా నందన్ కొణిదెల అని కాకుండా అకీరా నందన్ దేశాయ్ అని అక్కడి స్క్రీన్ల మీద దర్శనం ఇచ్చిందట

ఇలా చేయడం కరెక్ట్ కాదు

ఇలా చేయడం కరెక్ట్ కాదు


అయితే దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, కానీ అవి నిజమేనా లేక ఎడిట్ చేయబడ్డాయా అనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. అయితే ఇలా వైరల్ అవుతున్న ఫోటోల విషయంలో మెగా ఫ్యాన్స్ కాస్త బాధపడుతున్నారు. ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ రేణుదేశాయ్ కు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X