వకీల్ సాబ్ మ్యానియాలో అకీరా నందన్.. ఆ లుక్కుతో పవర్ స్టార్‌ను గుర్తు చేస్తూ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కోసం అభిమానులు గత ఏడాది నుంచి ఏ స్థాయిలో ఎదురుచూశారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక మొత్తానికి ఈ రోజుతో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందాయి. వరల్డ్ వైడ్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మొత్తానికి సినిమా హిట్ ను అందుకుంది. ఇక ఈ మ్యానియాలో పవన్ తనయుడి లుక్ కూడా వైరల్ అవుతోంది.

ఉదయం షోలతోనే..

ఉదయం షోలతోనే..

బాలీవుడ్ హిట్ మూవీ పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన వకీల్ సాబ్ శుక్రవారం దాదాపు 2000కు పైగా థియేటర్స్ లో విడుదలైంది. నైజాంలో ఉదయం షోలతోనే ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది. కేవలం అభిమానులే కాకుండా సినిమా ప్రముఖులు నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

దాదాపు మూడేళ్ళ అనంతరం

దాదాపు మూడేళ్ళ అనంతరం

ఎక్కడ చూసినా కూడా సర్వం వకీల్ సాబ్ మయం అనేలా కనిపిస్తోంది. దాదాపు మూడేళ్ళ అనంతరం పవన్ కళ్యాణ్ ను బిగ్ స్క్రీన్ పై చూసిన అభిమానులు సోషల్ మీడియాలో వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉదయం షాలతోనే ఒక్కసారిగా వకీల్ సాబ్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది.

వకీల్ సాబ్ మ్యానియాలో అకిరా

వకీల్ సాబ్ మ్యానియాలో అకిరా

ఇక ఈ సంబరాల్లో జూనియర్ పవర్ స్టార్ అకిరా నందన్ పేరు కూడా వైరల్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఏప్రిల్ 8న అకిరా పుట్టినరోజు కోవడంతో సెలబ్రెటీలు అభిమానులు పవన్ తనయుడికి బర్త్ డే విషెస్ అందించారు. ఫొటోలు చాలానే వైరల్ అయ్యాయి. ఇక వకీల్ సాబ్ మ్యానియాలో కూడా అకిరా ట్యాగ్ ట్రెండ్ అవుతుండడం విశేషం.

లేటెస్ట్ లుక్ వైరల్

లేటెస్ట్ లుక్ వైరల్

కొడుకు పుట్టినరోజు సందర్భంగా రేణు దేశాయ్ ఒక స్పెషల్ ఫొటోను పోస్ట్ చేసింది. అందులో అకిరా నందన్ ధోతి కట్టుకొని ఉన్నాడు. ఆ లుక్కుతో పవన్ కళ్యాణ్ ను గుర్తుచేస్తున్నట్లు ఉందని అభిమానులు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. వకీల్ సాబ్ తో పాటు అకిరా న్యూ లుక్ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Recommended Video

Valasa Movie Teaser | Manoj Nandam, Vinay Mahdev | Sunil Kumar Reddy
సినిమాల్లోకి అకిరా..

సినిమాల్లోకి అకిరా..

ఇక అకిరా సినిమాల్లోకి రావాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అకిరా అప్పుడప్పుడు వకీల్ సాబ్ షూటింగ్ లొకేషన్స్ కు కూడా వెళ్ళేవారట. అందువల్లే అతను ఆ సినిమాలో చిన్న పాత్ర చేసినట్లు రూమర్స్ వచ్చాయి. కానీ అందులో నిజం లేదని సినిమా విడుదలతో క్లారిటీ వచ్చేసింది. ఇక ప్రస్తుతం చదువుపై ఫోకస్ పెట్టిన అకిరా సినిమాల గురించి పెద్దగా ఆలోచించడం లేదని రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X