పవర్ స్టార్ తనయుడు అకిరా నందన్ న్యూ లుక్ వైరల్.. పక్కనే అభిమాన హీరో

సినిమా ఇండస్ట్రీలో అత్యదిక అభిమానులను సంపాదించుకున్న వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. అలాంటి హీరో నుంచి వారసుడు ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించడం కష్టంగానే ఉంటుంది. ఆ అంచనాల డోస్ మామూలుగా ఉండదనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరా నందన్ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక అప్పుడప్పుడు అకిరాకు సంబంధించిన ఫొటోస్ కూడా అభిమానులను మరింత ఆకర్షిస్తున్నాయి.

యువ హీరోతో అకిరా..

యువ హీరోతో అకిరా..

ఇక రీసెంట్ గా జూనియర్ పవర్ స్టార్ కి సంబంధించిన మరొక లుక్ కూడా వైరల్ గా మారింది. పక్కనే మరో యువ హీరో అడవి శేష్ కూడా ఉన్నాడు. అకిరా చాలా రోజుల తరువాత కనిపించడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో మురిసిపోతున్నారు. స్మార్ట్ గా కనిపిస్తూనే ఆ హైట్ తోనే షాకిస్తున్నాడు అంటూ.. పక్కన ఉన్న అడివి శేష్ కూడా చాలా చిన్నగా కనిపిస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

 ఆ హైట్ అంధరికంటే ఎక్కువ

ఆ హైట్ అంధరికంటే ఎక్కువ

అకిరా నందన్ వయసు ప్రస్తుతం 16 ఏళ్ళు. 2004లో జన్మించిన అకిరా చూస్తుండగానే మెగా ఫ్యామిలీలో అంధరికంటే ఎక్కువగా ఎదిగేశాడు. ప్రస్తుతం రానా, ప్రభాస్, వరుణ్ తేజ్ మాత్రమే అందరికంటే ఎక్కువ హైట్ లో ఉన్నారు. కానీ వారికంటే ఎక్కువగా 6.4 హైట్ తో అకిరా అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.

అకిరాకు ఇష్టమైన హీరో

అకిరాకు ఇష్టమైన హీరో

అడివి శేష్ అకిరా ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిన విషయమే. అకిరాకు ఇష్టమైన హీరో ఎవరు అంటే అడివి శేష్ అని గతంలో తల్లి రేణూ దేశాయ్ కూడా వివరణ ఇచ్చింది. ఎవరు సినిమా చూసిన తరువాత అకిరా అడివి శేష్ కి పెద్ద అభిమానిగా మారిపోయాడని రేణూ వివరణ ఇచ్చింది.

Recommended Video

Valayam Movie Trailer Launch | Adivi Sesh
హీరోగా ఎంట్రీ ఎప్పుడంటే..

హీరోగా ఎంట్రీ ఎప్పుడంటే..

అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది చాలా రోజులుగా అభిమానుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోన్న అంశం. ప్రస్తుతానికైతే అకిరాకు హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ లేదని రేణు దేశాయ్ కూడా పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు. హీరో అవ్వాలా లేదా అనేది పూర్తిగా తన ఇష్టమని కూడా అన్నారు. దీంతో అభిమానుల్లో ఆ ఆశలు ఇంకా తగ్గలేదు. తప్పకుండా అకిరా ఎంట్రీ ఉంటుందని ఆశతో ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X