Akira Nandan: అకిరా నందన్ లాంచ్‌పై హరీష్ శంకర్ ప్లాన్.. పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే..

Akira Nandan: అకీరా నందన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ నటవారసుడిగా అకీరా ఇంకా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతాడని కోట్లాది మంది అభిమానులు అత్రుతగా వేచి చూస్తున్నారు. అయితే.. అకిరా నందన్ హీరో అవుతాడా? లేక మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడా అనే చర్చ జరుగుతోంది. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్, అకిరా నందన్ భవిష్యత్తుపై పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా, హరీష్ శంకర్ మాట్లాడుతూ అకిరాను లాంచ్ పవన్ కళ్యాణ్ స్పందించిన తీరును వెల్లడించారు. ఇంతకీ అకీరా నందన్ ఎంట్రీ పై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే?

అకీరా నందన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టకుండానే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక అకీరా చదువులు కూడా దాదాపు పూర్తి కావడం, పలు విషయాల్లో ట్రైనింగ్ తీసుకోవడంతో ఈయన ఇండస్ట్రీ ఎంట్రీ గురించి తరచూ సోషల్ మీడియాలో వార్తలు వినపడుతూనే ఉంటాయి. గతంలో అకీరా ఇండస్ట్రీలోకి రావడం గురించి తన తల్లి రేణు దేశాయ్ పలు సందర్భాలలో స్పందించిన విషయం తెలిసిందే. ఆమె కూడా ఆకీరా ఏది ఇష్టమైతే అదే చేస్తాడని తన నిర్ణయానికి నా మద్దతు అంటూ తల్లిగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అయితే.. తాజాగా మరోసారి అకీరా సినీ ఎంట్రీపై మరోసారి చర్చ మొదలైంది.

Akira Nandan Launch Harish Shankar Reveals Pawan Kalyan s Reaction About His Son s Film Entry

ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా హరీష్ శంకర్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా అకిరా నందన్ సినీ ఎంట్రీ గురించి ప్రశ్నలు ఎదురవగా ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అకిరాను హీరోగా లాంచ్ చేయాలనే ఆలోచనను తాను ఒకటి రెండు సార్లు పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకువచ్చానని చెప్పారు. అయితే ఆ విషయంపై పవన్ కళ్యాణ్ పెద్దగా స్పందించలేదని తెలిపారు. హరీష్ శంకర్ చెప్పిన వివరాల ప్రకారం.. ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన అభిప్రాయం వెల్లడించారని తెలుస్తోంది. "అకిరాకు ఏం చేయాలనిపిస్తే అదే చేయనిస్తాను. అతను ఫ్యాన్స్ కోసం గానీ, తండ్రి కోసం గానీ హీరో అవ్వడు' అని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు హరీష్ శంకర్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా అకిరా నందన్ ఇప్పటికీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకపోయినా, ఇప్పటికే అతనికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు అతన్ని పవర్ స్టార్ వారసుడిగా హీరోగా చూడాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అతని హైట్, లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌ను చూసి భవిష్యత్తులో స్టార్ హీరో అవుతాడనే అంచనాలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు అకిరాకు సంగీతంపై కూడా మంచి ఆసక్తి ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆయన పియానో వాయిస్తూ తన మ్యూజిక్ టాలెంట్‌ను చూపించాడు. అందుకే కొందరు అభిమానులు అతను హీరో కంటే ముందుగా సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అయితే.. తాజాగా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను బట్టి చూస్తే, అతను హీరోగా ఎంట్రీ ఇవ్వాలా, మ్యూజిక్ డైరెక్టర్‌గా మారాలా అనే నిర్ణయం పూర్తిగా అకిరా చేతుల్లోనే ఉందని చెప్పాలి. మరి ఇండస్ట్రీలో ఎలా ఎంట్రీ ఇస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X