పవన్ కల్యాణ్ మూవీపై అకిరా నందన్ ఫోకస్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు మించి..!
తెలుగు సినిమా బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరోసారి తన కెరీర్ లో మంచి హైట్స్ చూస్తున్నారని చెప్పాలి. కాగా ఎప్పుడో సినీ కెరీర్ ని స్టార్ట్ చేసి వరుస పరాజయాలు తర్వాత మళ్ళీ ఫామ్ లోకి వచ్చి టాలీవుడ్ నెంబర్ 1 హీరోగా మారాడు అనే సమయంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ షాకిస్తూ రాజకీయాలు అంటూ దిగాడు.
అక్కడ నుంచి పవన్ మళ్ళీ పదేళ్ల పాటు ఎంతో కష్టపడి దెబ్బలు తింటే తప్ప ఇప్పుడు తాను ఏపీ డిప్యూటీ సీఎం గా మారలేదు. కాగా ఈక్రమంలో సినిమాల పరంగా కూడా అభిమానులకి పవన్ ఏమి తక్కువ ట్రీట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఆల్రెడి చేతిలో ఉన్న మూడు సినిమాలల్లో రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. అది కూడా స్ట్రైట్ సినిమాలు కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.

దీనితో ఈ సినిమాలు ఎప్పుడు వచ్చినా కూడా ఓ రేంజ్ లో వసూళ్లు వస్తాయి అనే నమ్మకం ఉంది. కాగా ఆ చిత్రాలే దర్శకుడు జ్యోతి కృష్ణ, సుజీత్ లతో చేస్తున్న సినిమాలు "హరి హర వీరమల్లు" ఇంకా "ఓజి" అని చెప్పాలి. రెండు కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ సినిమాలు కాకపోతే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కానీ వీరమల్లు మొగల్ నాటి కాలానికి చెందింది అయితే ఓజి ముంబై మాఫియా సంబంధిత నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.
కాగా ఈ చిత్రాల్లో అయితే పవన్ కళ్యాణ్ వారసుడు జూనియర్ పవర్ స్టార్ అకీరానందన్ ఓ సినిమా కోసం మ్యాడ్ లెవెల్లో వెయిట్ చేస్తున్నాడని యంగ్ హీరో అడివి శేష్ చేసిన తాజా కామెంట్స్ వైరల్ గా మారాయి. అకిరా తన నాన్న చేస్తున్న OG సినిమా కోసం ఎప్పుడు నుంచో చాలా వెయిట్ చేస్తున్నాడని తన నాన్నని గ్యాంగ్ స్టర్ రోల్ లో బిగ్ స్క్రీన్స్ పై ఎలా ఉంటాడో చూడాలని ఎదురు చూస్తున్నాడని తెలిపాడు.

దీనితో అకిరా ఫెవరెట్ మూవీగా ఇప్పుడు OG మారింది అని చెప్పాలి. దీనితో ఈ స్టేట్మెంట్ ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. కాగా పవన్ కళ్యాణ్ గతంలో ఎపుడు లేనిది తన వారసుడిని ప్రపంచం ముందుకు తన విజయం తర్వాత బయటకు తీసుకొచ్చాడు. ఇది అభిమానులకి మెగా అభిమానులకి మంచి హై ని అందించగా ఈ సూపర్ హైప్ లో పవన్ సినిమాలు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే పవన్ ఈ జూలై నుంచి ఈ సినిమాల షూటింగ్ లో పాల్గొననున్నారని వినిపిస్తుంది. కాగా వీరమల్లు ఇంకా OG చిత్రాలకి కేవలం రోజుల డేట్స్ ఇస్తే సరిపోతుంది. అకిరా కోరుకుంటున్న ఈ సినిమాని పవన్ ఎపుడు పూర్తి చేస్తాడో వేచి చూడాలి. అయితే ఈ సినిమా ఈ ఏడాదిలో విడుదల కాదని ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదిలోకి ఈ సినిమా వెళ్లనుంది.


Click it and Unblock the Notifications











