లుక్కు మార్చిన అకిరా నందన్.. పవన్‌ కల్యాణ్‌తో కలిసి కోచింగ్.. వామ్మో ఆ హైట్ ఏంటి సామీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అదే తరహాలో తనయుడు అకిరా నందన్ కూడా మంచి క్రేజ్ అందుకుంటున్నాడు. అతనికి సంబంధించిన ఒక్క ఫొటో విడుదలైనా కూడా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇక రీసెంట్ గా మరికొన్ని ఫొటోలు బయటకు రావడంతో ఒక్కసారిగా ట్రెండ్ లిస్ట్ లోకి చేరిపోయాయి.

ఈషా రెబ్బా.. ఘాటైన పోజులతో తెలుగమ్మాయి

 17 ఏళ్ల వయసులో..

17 ఏళ్ల వయసులో..

పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరా నందన్ అంటే మెగా అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు. టీనేజ్ వయసులోనే అకిరా నందన్ తన హైట్ తో అందరికి షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు 17ఏళ్ళకు వచ్చేయడంతో అన్నయ్య వరుణ్ తేజ్ కంటే ఎక్కువ ఎత్తుకు ఎదిగిపోయాడు.

తండ్రి తరహాలోనే..

తండ్రి తరహాలోనే..


ఓ వైవు అమ్మ ప్రేమను మరోవైపు తండ్రి ఆప్యాయతను ఏ మాత్రం మిస్సవ్వకుండా వారితో సమయాన్ని గడుపుతున్నాడు.
పవన్ కళ్యాణ్ ఎలాగైతే సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతాడో అలాగే అకిరా నందన్ కూడా నార్మల్ గానే ఉండడానికి ఇష్టపడతాడు. ఈ వయసులో స్టార్ కిడ్స్ అంటే స్టైలిష్ లైఫ్ కు అలవాటు పడుతుంటారు. కానీ అకిరా మాత్రం అందుకు విరుద్ధం.

సాధారణ జనాలతో కలిసి

సాధారణ జనాలతో కలిసి

అకిరా నందన్ క్రమశిక్షణ ఏమిటో ఆ మధ్య తిరుపతి దర్శనంతోనే చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. రేణు దేశాయ్ అలాగే ఇద్దరు పిల్లలు కూడా సాధారణ జనాలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మెగా కుటుంబ సభ్యులు అని తేలిస్తే వారికి స్పెషల్ గా దర్శనం దక్కేది. కానీ అవేవి వారు పట్టించుకోలేదు.

 సంగీత పాఠాలు..

సంగీత పాఠాలు..

ఇక చాలా కాలం తరువాత అకిరా నందన్ ఫొటోలు బయటకీ రావడంతో అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక ప్రముఖ సంగీత కళాకారిణి వద్ద అకిరా నందన్ వయోలిన్ నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. కొడుకుతో పాటు పవన్ కూడా చిన్నపాటి సంగీత పాఠాలు విన్నారట. ఆయన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 కాస్త లావుగా మారిన అకిరా

కాస్త లావుగా మారిన అకిరా

ఇక అకిరా నందన్ ను చూస్తుంటే ఈ లాక్ డౌన్ లో కొంచెం లావు అయినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు నిహారిక పెళ్లిలో సన్నగా కనిపించిన అకిరా ఇప్పుడు కాస్త మీడియం లుక్ లోకి మారాడు. ఆ హైట్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ ను మించిపోవడంతో జూనియర్ పవర్ స్టార్ టాలీవుడ్ ఎంట్రీపై అభిమానులు ఆశలు పెంచుకుంటున్నారు.

Recommended Video

NKR 18 Bimbisara, Kalyan Ram As A Barbarian King || Filmibeat Telugu
హీరోగా ఎంట్రీ.. ఎప్పుడు?

హీరోగా ఎంట్రీ.. ఎప్పుడు?

అకిరా నందన్ వయసు ఇప్పుడు 17 ఏళ్ళు. ఇక హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనే విషయంలో ఇప్పటివరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. రేణు దేశాయ్ చాలా సందర్భాల్లో అకిరా ఎంట్రీ ఇప్పట్లో ఉండదని ప్రస్తుతానికైతే తనకు హీరో అవ్వలనే ఇంట్రెస్ట్ లేదని కూడా ఉన్నారు. అకిరా దృష్టి మొత్తం చదువుపైనే ఉందని మ్యూజిక్ అంటే కూడా అతనికి చాలా ఇష్టమని రేణు దేశాయ్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X