Akira Nandan చేసిన పనికి మహేష్‌ బాబు ఫ్యాన్స్ ఫిదా.. జూనియర్ పవర్ స్టార్ వీడియోలు వైరల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు మెగా అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆయన కుమారుడు అకిరా నందన్‌కు కూడా సోషల్ మీడియాలో అంతే క్రేజ్ ఉందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే అకిరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి అభిమానాన్ని సంపాదించుకొన్న అకిరా తాజాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాడు. అకిరా చేసిన పనికి సూపర్‌స్టార్ మహేష్ బాబు కూడా ఫిదా అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళితే..

అకిరా స్కూల్‌లో పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్

అకిరా స్కూల్‌లో పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్

పవన్ కల్యాణ్ కుమారుడు అకిరా నందన్ ప్రస్తుతం ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఇంటర్మీడియెట్ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా కాలేజ్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ వేడుకల్లో పవర్ స్టార్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. పవన్‌తో స్యూల్ సిబ్బంది, విద్యార్థులు ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు.

ఆరడుగుల కటౌట్‌తో అకిరా నందన్

ఆరడుగుల కటౌట్‌తో అకిరా నందన్

ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన వేడుకల సందర్భంగా అకీరా నందన్ తోటి విద్యార్థులు, స్కూల్ యాజమాన్యంతో దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆరడుగులకు పైగా ఉన్న అకిరా సినీ హీరోలను తలదన్నేలా కనిపించాడు. అయితే అకిరా మీడియాలో ట్రెండింగ్‌గా మారడానికి అది కారణం కాలేదు. ఈ వేడుకల్లో మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సినిమా పాటకు పియానోలో మ్యూజిక్ వాయించడమే అందర్నీ ఆకర్షించింది.

కళావతి పాటను పియానోపై

కళావతి పాటను పియానోపై

స్యూల్ గ్రాడ్యుయేషన్‌కు సంబంధించిన వేడుకల్లో కళావతి పాటను తన పియానో మీద వాయించడంతో సినీ ప్రేక్షకులతోపాటు, మెగా, సూపర్ స్టార్ అభిమానుల ప్రేమను విశేషంగా సంపాదించుకొన్నాడు. ఆ వీడియోలు మెగా ఫ్యాన్స్ షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తండ్రి పోత్సాహంతోనే అకిరా

తండ్రి పోత్సాహంతోనే అకిరా

సోషల్ మీడియాలోని మెగా అభిమానుల ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో ప్రస్తుతం 4 వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటికి వేల సంఖ్యలో లైక్స్, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అకిరా ప్రతిభను చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతంలో తండ్రి పవన్ కల్యాణ్ స్వయంగా అకిరాను మ్యూజిక్ కాలేజీలకు తీసుకెళ్లేవాడని సన్నిహితులు చెప్పుకొంటారు. తండ్రి ఇచ్చిన పోత్సాహమే అకిరాను మ్యూజిక్‌లో ప్రతిభావంతుడయ్యేలా చేసిందనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

మహేష్ బాబు ఫ్యాన్స్ ఫిదా

ఇక అకిరా కళావతి పాటను ప్లే చేయడంపై మహేష్ బాబు అభిమానులు థ్రిల్ అవుతున్నారు. అకిరా ప్లే చేసిన వీడియోలను సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులు షేర్ చేసి పండుగ చేసుకొంటున్నారు. సూపర్ మ్యూజిక్, సూపర్బ్‌గా పియానోపై ప్లే చేశావు అంటూ కామెంట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఫోటోలు మీడియాలో వైరల్‌గా మారాయి.

తల్లి దర్శకత్వంలో యాక్టింగ్

తల్లి దర్శకత్వంలో యాక్టింగ్

అకిరా చదువు, మ్యూజిక్‌తోపాటు నటనపై కూడా దృష్టిపెట్టాడు. తల్లి రేణుదేశాయ్ దర్శకత్వం వహించిన ఇష్క్ వాలా లవ్ అనే చిత్రంలో కీలక పాత్రను పోషించాడు. ఆ సినిమాలో అకిరా నటన అందర్నీ ఆకట్టుకొన్నది. ఈ క్రమంలో అకిరా టాలీవుడ్ ఎంట్రీ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అకిరా మున్ముందు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాల్సిందే.

ఆక్సిజన్ సిలిండర్స్ దానం

గ్రాడ్యుయేషన్ వేడుకల్లో స్యూల్ యాజమాన్యం అకిరా నందన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అకిరాకు మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం. మ్యూజిక్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. అలాగే జంతు ప్రేమికుడు. జంతువుల కోసం చాలా సేవ చేస్తున్నాడు. కరోనావైరస్ కాలంలో నాలుగు ఆక్సిజన్ సిలిండర్స్‌ను హాస్పిటల్‌కు అందజేశారు. మానవసేవే మాధవసేవ అని అకిరా నమ్ముతున్నాడు అని స్కూల్ యాజమాన్యం వేడుకల్లో వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X