అఫీషియల్: సైరా దర్శకుడితో అఖిల్ సినిమా ఫిక్స్.. ఈసారైనా హిట్టు కొడతాడా?

కిక్, రేసుగుర్రం, ధృవ వంటి బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి మొత్తానికి తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చేలా చేశాడు. అక్కినేని యువ హీరో అఖిల్ 5వ సినిమాకు ఈ సైరా దర్శకుడు పవర్ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నట్లు గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు కాంబినేషన్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేసింది.

సీనియర్ నిర్మాత అనిల్ సుంకర నిర్మాతగా అఖిల్ 5వ సినిమా రూపొందనుంది. గత వారం రోజులుగా ఈ కాంబినేషన్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక మొత్తానికి AK ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా రానున్నట్లు అఫిషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చారు. సైరా లాంటి పాన్ ఇండియా సినిమా తరువాత సురేందర్ రెడ్డి ఎలాంటి సినిమా చేస్తాడు అని గత కొంత కాలంగా ఒక సస్పెన్స్ నెలకొంది.

 Akkineni akhil upcoming movie confirmed with surender reddy

అయితే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవర్ స్టార్ తో కూడా సినిమా ఉంటుందని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ రోజు 9వ తేదీ 9గంటల 9 నిమిషాల 9 సెకన్లకు అఖిల్ తో సినిమా ఉంటుందని వివరణ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రాజెక్టు కంటే ముందే సురేందర్ రెడ్డి అఖిల్ సినిమాను ఫినిష్ చేయనున్నాడు. మాస్ దర్శకులతో చేయాలని ఇన్నాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖిల్ కి కిక్ దర్శకుడు దొరకడం అదృష్టమనే చెప్పాలి. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X