నాగ చైతన్య-సమంత విడాకులపై అమల షాకింగ్ కామెంట్స్.. నెటిజన్స్ తిట్టడం కరెక్టే అంటూ!
టాలీవుడ్ బ్యూట్ కపుల్స్ పేరు తెచ్చుకున్న నాగ చైతన్య-సమంత విడాకుల విషయం ఇప్పటికీ.. ఏదో ఒక రకంగా ప్రస్తావనకు వస్తూనే ఉంది. చై-సామ్ విడిపోతున్నట్లు అక్టోబర్ 2, 2021 ప్రకటించడంతో యావత్ తెలుగు సినీ లోకం నివ్వెరపోయిన విషయం తెలిసిందే. ఎందుకు ఇలా జరిగింది? కారణాలేంటి? అనేవి ఇప్పటికీ హాట్ టాపిక్‌గా మారాయి. డివోర్స్ అనౌన్స్మెంట్ తర్వాత ఎన్నో విషయాలు చక్కర్లు కొట్టాయి. అందులోనూ సామ్‌పై ఎక్కువగా విమర్శలు వచ్చాయి. అయితే ఆ విమర్శలు, నెటిజన్ల కామెంట్స్ కరెక్ట్ అన్నట్లుగా మాట్లాడారు అక్కినేని అమల. ఆమె తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పెద్ద షాక్: ఏ మాయ చేశావే సినిమాతో నాగ చైతన్య, సమంత ప్రేమకు బీజం పడింది. తర్వాత అనేక సినిమాల్లో జోడీగా నటించి బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్ పెయిర్ అనిపించుకున్నారు. దాన్ని నిజం చేస్తూ పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు చైతూ, సామ్. ఇక పెళ్లయిన నాలుగేళ్లకు డివోర్స్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చింది చైసామ్ జంట.

అదే కారణమా?: నాగ చైతన్య, సమంత విడిపోయాక ఎన్నో రూమర్స్ చక్కర్లు కొట్టాయి. నెటిజన్లు ఇష్టారీతిగా కామెంట్స్ పెట్టారు. అన్నిటికిమించి సమంతపై అధికంగా ట్రోలింగ్, విమర్శలు, తిట్డడం వంటివి కూడా చేశారు. సమంత రూ. 250 కోట్ల భరణం అడిగిందని, ఆమె హాట్ సీన్లలో నటించడమే విడాకులకు దారితీసిందంటూ ఎంతో మంది విమర్శించారు.
అలా ముందుకు: తనపై వచ్చిన విమర్శలకు చాలా ధీటుగా జవాబు ఇస్తూ వచ్చింది సమంత. ఇక ఇటీవల సమంత లవ్లీ ఉమెన్ అని నాగ చైతన్య కూడా చెప్పాడు. కానీ సామ్ మాత్రం అందుకు కౌంటర్ గా రిప్లై ఇచ్చింది. ఇక చైతూ, సామ్ విడిపోయాకా కెరీర్ పరంగా ఎవరి దారి వారు చూసుకున్నారు. సినీ రంగంలో కెరీర్ పై ఫోకస్ పెడుతూ ముందుకు వెళ్తున్నారు.

చై-సామ్ సినిమాలు: నాగ చైతన్య ఇటీవల కస్టడీ సినిమాతో రాగా అది ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు చందూ మొండేటి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే సమంత కూడా శాకుంతలంతో ఓటమి చూసింది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ఖుషి, బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్ తో సిటాడెల్ ప్రీక్వెల్, ఇంగ్లీష్ యాక్టర్ వివేక్ కల్రతో చెన్నై స్టోరీ సినిమాలు చేస్తుంది సామ్.
రహస్యంగా కాదు: ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చైతూ-సామ్ పై వచ్చే నెగెటివ్ కామెంట్స్ పై అక్కినేని అమల స్పందించారు. "సెలబ్రిటీ జీవితం అన్న తర్వాత మన గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం సహజం. దానిని మనం మార్చలేం. సమంత, నాగ చైతన్య విడాకులు ఏం రహస్యంగా జరగలేదు" అని అక్కినేని అమల అన్నారు.

స్వాగతిస్తున్నాను:"సమంత, నాగ చైతన్య విడాకులు పబ్లిక్ గానే జరిగింది. మరి దాని గురించి నెటిజన్స్ అభిప్రాయాలను స్వీకరించడం కూడా మన బాధ్యత. కాబట్టి వాళ్ల అభిప్రాయాలను నేను స్వాగతిస్తున్నాను" అని అక్కినేని అమల నెటిజన్లు తిట్టడం, విమర్శించడం కరెక్టే, వాటిని ఒప్పుకోవాల్సిందే అనే అర్థంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక చైతూ క్లారిటీ ఉన్న వ్యక్తి అని, అఖిల్ జనాల ప్రేమ కోరుకుంటాడని ఆమె చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











