అఖిల్ కోసం అమల... ఆ డైరెక్టర్ తో మంతనాలు!
అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఎంత హ్యాండ్సమ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తండ్రి అక్కినేని నాగార్జునలాగే ఫిజిక్ అండ్ ఫిట్ నెస్ పైనా ఎంతగానో శ్రద్ధ వహిస్తుంటారు. ఇప్పటికీ టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ మెయింటేయిన్ చేస్తున్న హీరోల్లో అఖిల్ ఒకరు. బిగ్ స్క్రీన్ పై తన చామింగ్ అండ్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. లుక్స్ పరంగా ఆయనను అభిమానించే వారు చాలా మందే ఉన్నారు. కానీ అఖిల్ సినిమాల విషయంలో మాత్రం కాస్తా వెనకబడ్డారనే టాక్ ఇండస్ట్రీలో కొన్నాళ్లుగా కొనసాగుతూనే ఉంది.
అఖిల్ ఎంత ప్రయత్నించిన సక్సెస్ బాటలో పయనించలేకపోతున్నారు. ఆయన కెరీర్ లో ఒకటి రెండు మినహా పెద్ద హిట్ సినిమాలేవీ లేవు. దీంతో అఖిల్ కెరీర్ ప్రస్తుతం గందరగోళంగా ఉంది. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు మనవడిగా, కింగ్ అక్కినేని నాగార్జున కొడుకుగా అఖిల్ కూడా విజయవంతమైన చిత్రాలను అందుకోలేకపోతున్నారు. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇంకా పూర్తి స్థాయిలో కెరీర్ లో స్టేబుల్ కాలేకపోతున్నారని పలువురు సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే... అఖిల్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయడం నుంచి ఇప్పటి వరకు అక్కినేని నాగార్జున అన్నింటా శ్రద్ధ వహించారు. సిసింద్రీతోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్న అఖిల్ హీరోగా స్టార్ స్థాయికి చేరుకుంటారని అంతా భావించారు. కానీ వరుసగా డిజాస్టర్లు పడుతుండటం బాధాకరంగా మారింది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంతో మాత్రం అఖిల్ సక్సెస్ ను అందుకున్నారు. ఆ తర్వాత భారీ స్థాయిలో విడుదలైన 'ఏజెంట్' చిత్రం కూడా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో అఖిల్ కెరీర్ గందరగోళంలో పడింది. ఇక కాస్తా గ్యాప్ తీసుకొని ఫుల్ జోష్ లో రీస్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది.
అయితే ఈసారి అఖిల్ కెరీర్ ను గాడీలో పెట్టేందుకు తల్లి అమల స్పెషల్ కేర్ తీసుకుంటుందని తెలుస్తోంది. ఎలాగైనా హిట్ చిత్రాలవైపు అఖిల్ కెరీర్ ను మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సందర్భంగా టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మంతనాలు జరుపుతున్నారంట. ఆయన్ని అఖిల్ కు మెంటర్ గా ఉండమని కోరినట్టు తెలుస్తోంది. ఇకపై అఖిల్ తీయబోయే సినిమాలు, స్టోరీలు, ఇతర విషయాల్లో ప్రశాంత్ నీల్ కేర్ కూడా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్31 చిత్రాన్ని చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఖిల్ నుంచి నెక్ట్స్ రాబోయే చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంది. మరి దీనిపై మరింత స్పష్టత కూడా రావాల్సి ఉంది.

మరోవైపు అఖిల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. 2024 నవంబర్ 26న ఇండస్ట్రియలిస్ట్ జుల్ఫీ రావ్ద్ జీ కూతురు జైనాబ్ తో ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. సమ్మర్లో పెళ్లి వేడుక ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇక అన్న అక్కినేని నాగచైతన్య రీసెంట్ గా 'తండేల్'తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. అఖిల్ కూడా తన రాబోయే చిత్రంతో మంచి విజయాన్ని సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications











