మన్మథుడు 2లో అక్కినేని అమల.. చాలా రోజుల తర్వాత!

కింగ్ నాగార్జున దేవదాస్ చిత్రం తరువాత మరో చిత్రానికి సైన్ చేయలేదు. త్వరలో కింగ్ నాగ్ తన సూపర్ హిట్ మూవీ మన్మథుడు చిత్ర సీక్వెల్ లో నటించబోతున్నాడు. మన్మథుడు చిత్రానికి సీక్వెల్ గా మన్మథుడు 2 టైటిల్ తో రాహుల్ రవీంద్రన్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. కథ మొత్తం సిద్ధం కావడంతో నాగ్ షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి తాజగా ఆసక్తికర వార్తలు వినిపిస్తన్నాయి.

కథ పరంగా ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం యూరప్ లో జరుగుతుందట. కాగా నాగార్జున సతీమణి అమల ఈ చిత్రంలో గెస్ట్ రోల్ ప్లే చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ప్రస్తుతం అక్కినేని అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. నాగార్జునతో వివాహం తర్వాత అమల నటనకు బాగా దూరమైంది. కొన్ని హిందీ చిత్రాల్లో మాత్రం మెరిసింది.

Akkineni Amala to play guest role in Nagarjunas Manmadhudu 2

కొన్నేళ్ల క్రితం శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో తల్లి పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ నటించిన మనం చిత్రంలో గెస్ట్ రోల్ లో మెరిసింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అమల మన్మథుడు 2 లో గెస్ట్ రోల్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X