సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అక్కినేని ఫ్రేమ్.. సమంత మిస్!
అక్కినేని కుటుంబమంతా ఒక్కచోటుకు చేరి సందడి చేసింది. అక్కినేని నాగార్జున సోదరుడు అక్కినేని వెంకట్ కుమారుడి నిశ్చితార్థ వేడుక కోసం చెన్నైలో దిగింది అక్కినేని ఫ్యామిలీ. అక్కినేని వెంకట్ కుమారుడు ఆదిత్య, ఐశ్వర్యను పెళ్లాడనున్నాడు. ఈ మేరకు వీరిద్దరి నిశ్చితార్థం తో చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కి అక్కినేని వారసులంతా హాజరై ఎంజాయ్ చేశారు.
నాగార్జున, అమల, అఖిల్, సుశాంత్, సుమంత్, సుప్రియ, నాగసుశీలతో ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. అంగరంగవైభవంగా జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు అక్కినేని అఖిల్.
అక్కినేని ఫ్యామిలీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా షేర్ చేశాడు.

ఈ సందర్భంగా సోదరుడు ఆదిత్యకు విషెష్ తెలిపిన అఖిల్.. ఐశ్వర్యను అక్కినేని ఫ్యామిలీలోకి వెల్‌కమ్ చెప్పాడు. ఇక ఈ ఫోటో చూసిన ప్రతీ ఒక్కరు అక్కినేని యువ దంపతులు నాగచైతన్య, సమంత కోసం వెతుకుతున్నారు. ఈ ఫ్యామిలీ పిక్ లో సమంత మిస్ కావడంతో ఆమె ఎక్కడ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
సమంత తన సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటం కారణమగానే ఈ వేడుకకు హాజరు కాలేదని తెలుస్తోంది. ఏదేమైనా ఈ ఫ్రేమ్‌లో ఆమె కూడా ఉండుంటే అక్కినేని అభిమానులు ఇంకా ఖుషీ అయ్యేవారు.


Click it and Unblock the Notifications











