Ram Charan: అఖిల్‌కు బదులు నిఖిల్.. రామ్ చరణ్‌పై అక్కినేని, మెగా ఫ్యాన్స్ అసహనం!
చిరుత సినిమాతో హీరోగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ అతి తక్కువ కాలంలోనే మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. ఇక ఇటీవల రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. అలాగే రామ్ చరణ్ మార్కెట్ కూడా పెరిగింది. అందుకు తగినట్లుగానే సినిమాలు చేస్తున్నా రామ్ చరణ్ ఇటీవలే మరో బ్యానర్ నెలకొల్పిన విషయం తెలిసిందే. వి మెగా పిక్చర్స్ బ్యానర్ లో తొలి హీరోగా చేస్తున్నాడు నిఖిల్. దానికి సంబంధించిన టైటిల్ మోషన్ పోస్టర్ వీడియోను ఇటీవలే రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పై అటు అక్కినేని, ఇటు మెగా ఫాన్స్ అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
తండ్రితో సినిమాలు: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకవైపు బిజీగా పాన్ ఇండియా సినిమాలను చేస్తూనే మరొకవైపు డిఫరెంట్ స్టోరీలను ప్రొడ్యూస్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ (Konidela Production Company)పై తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహా రెడ్డి, ఆచార్య సినిమాలను నిర్మించాడు.

ముగ్గురు కలిసి: కొత్త టాలెంట్ ను మరింతగా ఎంకరేజ్ చేసే విధంగా ఇటీవల యూవీ క్రియేషన్స్ నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ తో కలిసి 'వి మెగా పిక్చర్స్' (V Mega Pictures) ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించాడు రామ్ చరణ్. తాజాగా వీరితోపాటు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ కూడా జత కట్టారు. ఈ ముగ్గురు కలిసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన 'ది ఇండియా హౌజ్' (The India House) సినిమాను అధికారికంగా ప్రకటించారు.
నిఖిల్ హీరోగా: 'ది ఇండియా హౌజ్' టైటిల్ వీడియోతో ఆసక్తి పెంచిన మేకర్స్ అందులో నిఖిల్ హీరోగా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే వి మెగా బ్యానర్ లో తొలి సినిమా అక్కినేని అఖిల్ తో ఉంటుందని టాక్ నడిచింది. ఏజెంట్ ప్లాప్ అయినా అఖిల్ కు హిట్ పడేందుకు మంచి ఛాన్స్ వచ్చిందనుకున్నారు. కానీ చివరకు అందులో నిఖిల్ హీరోగా అని చెప్పడంతో అక్కినేని ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

ఎందుకు ఒప్పుకున్నారు: ఈ సినిమాలో అఖిల్ తప్ప మరెవరూ నటించరని చాలా మంది అక్కినేని అభిమానులు ఆశించారు. కానీ మేకర్స్ ఇచ్చిన ప్రకటనతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరోవైపు మెగా ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ నిర్ణయంపై నిరాశతో ఉన్నారు. మెగా కాంపౌండ్ లో అంతమంది హీరోలు ఉండగా.. నిఖిల్ ను మాత్రమే ఎందుకు ఎంపిక చేసుకున్నారంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.

వీర్ సావర్కర్ జయంతి: ఇలా రామ్ చరణ్ తన కొత్త బ్యానర్ లోని తొలి సినిమాలో అఖిల్, మెగా హీరోలకు బదులుగా నిఖిల్ ను హీరోగా ఒప్పుకోవడంతో చెర్రీపై అక్కినేని, మెగా అభిమానులు కాస్తా అసహనంతో ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇదిలా ఉంటే ది ఇండియా హౌజ్ మూవీ స్వాతంత్ర పోరాట యోధుడు వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు.


Click it and Unblock the Notifications











