Sobhita: శోభిత, నాగచైతన్య రొమాంటిక్ డేట్.. రానా దగ్గుబాటి కోసం..!
కొత్త జంట అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ జోడీ హనీమూన్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తండేల్ హడావుడిలో ఉన్న చైతూ కూడా సినిమా హిట్ కావడంతో మంచి జోష్‌లో ఉన్నాడు. చివరికి పెళ్లి సమయంలోనూ గడ్డం, హెయిర్ కట్ చేసుకోకుండా కనిపించడంతో మిమ్మల్ని క్లీన్ షేవ్‌లో ఎప్పుడు చూస్తానో అంటూ శోభిత సరదాగా ఆట పట్టించేవారు. తండేల్ విజయం సాధించడం, అది కూడా శోభితతో పెళ్లయిన వెంటనే హిట్ అందుకోవడాన్ని అక్కినేని అభిమానులు శుభ శకునంగా భావిస్తున్నారు.
సమంతతో విడాకుల తర్వాత కొన్నాళ్ల పాటు ఒంటరిగానే జీవితం సాగించిన నాగచైతన్య అందరికీ షాకిస్తూ హీరోయిన్ శోభిత ధూళిపాళతో ప్రేమలో పడ్డాడు. తొలుత ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చిన శోభిత అనంతరం గతేడాది డిసెంబర్ 4న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్లకుండా ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అవ్వడంతో వీలు చూసుకుని ఇద్దరూ ఫారిన్ ట్రిప్ వేశారు. మెక్సికో వెళ్లిన ఈ జంట అక్కడి వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది.

శోభితతో రిలేషన్‌పై ఇటీవల ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య కీలక విషయాలు పంచుకున్నారు. ఆమెతో జీవితాన్ని పంచుకోవడం ఆనందంగా ఉందని.. తనతో అన్ని విషయాలు పంచుకుంటానని, ఎప్పుడైనా కన్‌ఫ్యూజ్ అయితే వెంటనే ఆమె సలహా తీసుకుంటానని చైతూ తెలిపారు. తండేల్ సూపర్ హిట్‌తో నాగచైతన్య మంచి జోష్‌లో ఉన్నారు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా కోసం మరోసారి భార్యకు దూరంగా ఉండాల్సి రావడంతో ఉన్న కొద్ది సమయాన్ని శోభితతో గడపాలని చైతన్య డిసైడ్ అయ్యారు. అందుకే తక్కువ సమయంలో ఎక్కువ దేశాలు కవర్ చేస్తోంది ఈ జంట. అటు శోభిత కూడా పెళ్లి పనులు ఉండటంతో కొంత సైలెంట్ కాగా.. తిరిగి తన కెరీర్‌పై ఫోకస్ పెట్టనున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌లలో వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఆమె బిజీగా ఉంది. మొన్నామధ్య శోభిత నటించిన మేడ్ ఇన్ హెవెన్ చిత్రం ఆరేళ్లు పూర్తి చేసుకోవడంతో దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసి ఎమోషనల్ అయ్యారు శోభిత.

ఇదిలాఉండగా.. నాగచైతన్య- శోభితాలు ఓ స్టోర్‌లో చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరూ హనీమూన్ నుంచి వచ్చేశారా? లేక పాత వీడియోనా అనేది మాత్రం క్లారిటీ రాలేదు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి చై- శోభితలు సందర్శించిన స్టోర్ .. వీరి బంధువు, సినీనటుడు రానా దగ్గుబాటికి చెందినదిగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో బ్రాడ్ వే పేరుతో రానా ఇటీవల స్టోర్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా తన స్నేహితులతో సరదాగా కబుర్లు చెబుతూ, నవ్వులు చిందిస్తున్న నాగచైతన్య- శోభితల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ వీడియో శోభిత షార్ట్ డ్రెస్‌లో కనిపించగా.. చైతన్య మాత్రం సింపుల్‌గా టీ షర్ట్, ప్యాంట్‌లో స్టైలీష్‌గా కనిపించారు.


Click it and Unblock the Notifications











