ప్లాన్స్ ఫ్లాప్.. సమంతకు సర్ ప్రైజ్ ఇచ్చిన అక్కినేని హీరో
టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లలో ఒకరైన సమంత నాగ చైతన్య మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. నేడు సమంత పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు ఈ స్టార్ హీరోయిన్ కి బెస్ట్ విషెస్ అందిస్తున్నారు. ఇక నాగ చైతన్య కూడా తన సతీమణి పుట్టినరోజున స్పెషల్ గా ఒక సర్ ప్రైజ్ ఇవ్వడం అందరిని ఎట్రాక్ట్ చేస్తోంది. సమంత ప్రతి పుట్టినరోజుకు చైతు ఎదో ఒక విధంగా థ్రిల్ చేస్తుంటాడు.
Recommended Video

ఇప్పటికి ప్రేమ పక్షులే..
2017లో ఒకటైన ఈ జంట వారి వివాహ జీవితంపై పెద్దగా రూమర్స్ రానివ్వలేదు. హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ ని కొనసాగిస్తు ఎప్పటికప్పుడు న్యూ లవ్ బర్డ్స్ లా దర్శనమిస్తూ ఉంటారు. ఇకపోతే గత కొన్ని నెలల నుంచి సమంత చైతూ సినీ కెరీర్ కారణంగా కాస్త బిజీగా ఉండడం వల్ల ఎక్కువగా కలవడం కుదరలేదు. ఇక ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఒకే ఇంట్లో ప్రతిరోజు హాని మూన్ కంటే హై రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారట.

సమంత బర్త్ డే స్పెషల్..
నేడు సమంత 33వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా నాగ చైతన్య తన శ్రీమతి కోసం స్పెషల్ గా ఒక కేక్ తయారు చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను కూడా సామ్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నాగ చైతన్య కిచెన్ లో తన టాలెంట్ తో తియ్యని కేక్ ని తయారు చేసినట్లు సమంత పేర్కొన్నారు.

ప్లాన్స్ ప్లాప్..
సాధారణంగా సమంత తన ప్రతి బర్త్ డే కోసం స్పెషల్ హాలిడే స్పాట్స్ లను టార్గెట్ చేస్తుంది. సినిమాలను పక్కనపెట్టి మూడు నెలల ముందు నుంచె ప్లాన్స్ వేసుకోవడం స్టార్ట్ చేస్తుంటారు. ఇక ఈ ఏడాది కూడా అదే తరహాలో ఎక్కడికైనా వెళ్లాలని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా ప్లాన్స్ అన్ని ప్లాప్ అయ్యాయి. హైదరాబాద్ లో తన నివాసంలోనే ఉంటూ భర్తతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది సమంత.

నెక్స్ట్ బిజీబిజీ.
లాక్ డౌన్ ఎండ్ అయితే ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో నటీనటులు బిజీ బిజీ కానున్నారు. నాగ చైతన్య, సమంతలు కూడా కొన్ని సినిమాలకు కమిట్ అయ్యారు కాబట్టి తీరిక లేకుండా మళ్ళీ వర్క్ మోడ్ లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే రిలీజ్ కావాల్సిన నాగ చైతన్య లవ్ స్టోరీ లాల్ డౌన్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అలాగే సమంత స్టార్ట్ చేయాల్సిన ప్రాజెక్టులు కూడా పెండింగ్ లో పడ్డాయి.


Click it and Unblock the Notifications











