Naga Chaitanya : బాధ భరించాల్సిందే.. సమంతపై నాగచైతన్య షాకింగ్ కామెంట్స్
అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ వివాహం నేపథ్యంలో చిత్ర సీమ, అభిమానులు ఎగ్జయిటింగ్‌తో ఉన్నారు. సమంతతో విడిపోయిన కొన్నేళ్ల తర్వాత నాగచైతన్య వివాహం చేసుకుంటున్న దృష్ట్యా ఈ పెళ్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన మాజీ భార్య సమంతపై నాగచైతన్య చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఓ పాత వీడియో వైరల్ అవుతోంది . ఈ వివరాల్లోకి వెళితే..
ఏమాయ చేశావో సినిమాలో తనతో కలిసి నటించిన సమంతతో నాగచైతన్య ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలోనే పెద్దల అంగీకారంతో వీరిద్దరూ గోవాలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేసిన ఈ జంట లాక్‌డౌన్ సమయంలోనూ ఇద్దరూ పెట్స్, మొక్కల పెంపకడం వంటి కార్యక్రమాలతో గడిపేశారు. ప్రతిరోజూ ఇద్దరూ ఏదో ఒక విషయం గురించి ఖచ్చితంగా పోస్ట్ పెట్టారు.

అయితే ఏం జరిగిందో ఏమో కానీ సమంత తన పేరుకు ముందు అక్కినేని అన్న ఇంటిపేరు తీసేయడంతో పాటు గతంలో నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాల నుంచి తొలగించింది. ఈ పరిణామాలతో ఇండస్ట్రీ, అభిమానులు షాక్ అయ్యారు. వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని అంతా భయపడ్డారు. చైతూ- సమంత విడాకులు తీసుకోబోతున్నట్లుగా మీడియాలో చానాళ్లు నడిచింది. ఓ ఫైన్ మార్నింగ్ వీరిద్దరూ ఆ న్యూస్ అధికారికంగా ప్రకటించడంతో సస్పెన్స్‌కు తెరపడింది.
చైతన్య - సమంతల విడాకులపై స్వయంగా నాగార్జున సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. భార్యాభర్తల మధ్య జరిగే వ్యవహారాలు పూర్తిగా వారి వ్యక్తిగతమని, చైతూతో పాటు తనకు సమంత అంటే చాలా ఇష్టమని ఆయన అన్నారు. ఈ క్లిష్టపరిస్ధితుల్లో వారిద్దరికీ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని నాగార్జున సోషల్ మీడియా ద్వారా కోరారు. కట్ చేస్తే .. విడాకుల అనంతరం చైతన్య, సమంతలు ఎవరి దారులు వారు చూసుకుని కెరీర్‌పై ఫోకస్ పెట్టారు.
ఇలాంటి దశలో నాగచైతన్య మరో తోడు వెతుక్కున్నారు. సినీ నటి శోభితతో ప్రేమలో పడిన ఆయన కొద్దిరోజుల క్రితం నిశ్చితార్ధం చేసుకున్నారు. ఈరోజు శోభిత మెడలో మూడు ముళ్లు వేయనున్నారు నాగచైతన్య. ఈ క్రమంలో ఆయన పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమ ఉన్న చోట బాధ కూడా ఉంటుందని.. రెండూ భరించాలని నాగచైతన్య అంటున్నారు.
సమంతలో తన నిజాయితీ నాకు బాగా ఇష్టమని.. ఏదైనా విషయం నచ్చితే నచ్చిందని, లేదంటే నచ్చలేదని చెప్పేస్తుందని ఆయన తెలిపారు. ఇద్దరం ఒకరికొకరు తోడుగా ఉంటామని.. ఇద్దరం బిజీగా ఉండటంతో వారానికి ఒక రోజు సెలవు తీసుసుకోవాలని తాము రూల్ పెట్టుకున్నామని చైతూ చెప్పారు. ఇద్దరం కలిసి మరిన్ని సినిమాలు చేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అక్కినేని అభిమానులు కాస్త డల్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











