ప్రభాస్ 'బుజ్జి'పై నాగచైతన్య స్పెషల్ రైడ్ .. రివ్యూలో ఏం చెప్పాడంటే..?
'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం 'కల్కి 2898 ఏడీ' . ఇందులో ప్రభాస్ సరసన దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని , రాజేంద్ర ప్రసాద్, పశుపతి, అన్నాబెన్‌లు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినిదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాదు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ''మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ మూవీ''గా కల్కి 2898 ఏడీ నిలిచింది. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
భారతీయ పురాణాలు, సైన్స్ ఫిక్షన్ మేళవింపుగా నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం ఆయన సరికొత్త లోకాన్ని సృష్టిస్తూ.. రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ హీరో అయితే.. ఆయనని మించిన సూపర్‌స్టార్‌గా 'బుజ్జి' అనే స్పెషల్ వెహికల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. సినిమాలో ఈ కారుదే కీ రోల్ అని యూనిట్ చెబుతోంది. అందుకే దేశంలోని ఆటోమొబైల్ నిపుణులను సంప్రదించి ఈ కారును తయారు చేయించుకున్నాడు నాగ్ అశ్విన్. 'బుజ్జి ' లాంచింగ్ సెర్మనీని గ్రాండ్‌గా ఏర్పాటు చేసి ఇండస్ట్రీ ఔరా అనిపించుకునేలా చేశాడు.

దీంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీతో పాటు ప్రముఖులు , నెటిజన్లు కారుపై ఫోకస్ పెట్టారు. దీనిని ఎలా తయారు చేశారు.. డిజైనింగ్ ఎవరు చేశారు, ఏమేం స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి.. అనేది శోధిస్తున్నారు. మరికొందరైతే ఆ కారును తాము కూడా డ్రైవ్ చేయాలని తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలో యువ హీరో అక్కినేని నాగచైతన్య 'బుజ్జి'ని రైడ్ చేశారు. చిన్నప్పటి నుంచి చైతూకి కార్లు, బైక్‌లంటే పిచ్చి .. అందులోనూ స్పోర్ట్స్ కార్లంటే మరింత మోజు. హైదరాబాద్ రోడ్లపై లేటెస్ట్ మోడల్ స్పోర్ట్స్ కార్లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ కార్ల పిచ్చితోనే ''హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ మోటార్ స్పోర్ట్స్ టీమ్''కు నాగచైతన్య ఓనర్‌గా వ్యవహరిస్తున్నారు.
అలాంటి వ్యక్తికి 'బుజ్జి' కనిపిస్తే ఇంకేమైనా ఉందా.. వెంటనే ఆ కారును డ్రైవ్ చేసి థ్రిల్ అయ్యారు చైతూ. ఈ ఎక్స్‌పీరియన్స్‌ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తాను ఇంకా షాక్‌లోనే ఉన్నానని.. ఇంజనీరింగ్ రూల్స్‌ను బ్రేక్ చేశారని బుజ్జి కోసం కష్టపడిన బృందంపై నాగచైతన్య ప్రశంసల వర్షం కురిపించారు. చైతూ 'బుజ్జి'ని డ్రైవ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో స్పోర్ట్స్ కార్లు నడిపిన అనుభవం ఉండటంతో పాటు రేసర్ కావడంతో 'బుజ్జి'ని జెట్ స్పీడ్‌తో నడిపారు చైతూ.
కాగా.. 'కల్కి 2898 ఏడీ'' ప్రాజెక్ట్‌కు తగిన కారు కావాలని.. సాయం చేయాలని నాగ్ అశ్విన్ కోరడంతో ప్రముఖ పారిశ్రామికవేత్త , మహేంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహేంద్ర స్పందించారు. ఆయన ఆదేశాలు, సూచనలతో మహేంద్ర గ్రూప్, జయమ్ ఆటోమోటివ్ కంపెనీల సాయంతో తమిళనాడులోని కోయంబత్తూరులో బుజ్జీని తీర్చిదిద్దారు.
ఇందుకోసం దాదాపు రూ.7 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. 6 టన్నుల బరువుండే కారు కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన టైర్లను వినియోగించారు. 6075 మి.మీ పొడవు.. 3380 మి.మీ వెడల్పు.. 2418 మి.మీ ఎత్తుతో ఈ టైర్లను 'సీయెట్ ' కంపెనీ తయారు చేసింది. వీటికి 34.5 అంగుళాల రిమ్‌లను వినియోగించినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 'బుజ్జి' లాంచ్ కార్యక్రమం ముగిసిన తర్వాత చిత్రయూనిట్‌ను, కారును తయారు చేసిన సిబ్బందిని ఆనంద్ మహేంద్ర అభినందించారు.


Click it and Unblock the Notifications











