Thandel: నాగచైతన్యపై అల్లు అరవింద్ ఆగ్రహం.. సినిమా కోసం కోట్లు ఖర్పు పెడితే..

Thandel: అక్కినేని నాగచైతన్యపై స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారా? నిజామా..? ఎందుకు? అని ఆలోచిస్తున్నారా.. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీపై ఓ లూక్కేయండి.

యువ‌ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌(Naga Chaitanya), న్యాచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi) జంట‌గా న‌టించిన సినిమా'తండేల్‌' Thandel). ఈ మూవీకి చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా.. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అర‌వింద్ నిర్మించారు. మత్య్స కారులు జీవన విధానం ఆధారంగా తెరకెక్కించారు. గతంలో నాగ చైతన్య, సాయి పల్లవి కాంబో తెరకెక్కిన 'లవ్ స్టోరీ' ఎంతటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అలాంటి క్రేజీ హిట్ ఫెయిర్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే నమోదయ్యాయి.

Akkineni Naga Chaitanya Sai Pallavi s Thandel movie team released a special video on Movie release date

తండేల్ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ దాదాపు రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. నాగ చైతన్య కెరీర్ లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ.అయితే.. ఈ మూవీ విడుదల తేదీ హాట్ టాఫిక్ గా మారింది. ఈమూవీని సంక్రాంతికి విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ముందుగా ప్ర‌క‌టించారు. కానీ, సంక్రాంతి బ‌రిలో రామ్ చ‌ర‌ణ్‌, వెంక‌టేష్‌ బరిలో నిలువడంతో పోటీ నుంచి త‌ప్పుకుంది తండేల్. మార్చ్ , ఏప్రిల్ లో విడుదల చేద్దాం అనుకుంటే.. చాలా దూరం అవుతోంది. అలాగే.. ఈ నెలల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. విడుదల చేసిన అనుకున్న రెస్పాన్స్ రాదు. అలాంటి టైమ్ లో మూవీ విడుదల చేయడం రిస్కే.

య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపుదిద్దుకున్న తండేల్ విడుదల ఎప్పుడంటూ అక్కినేనీ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. మూవీని సంకాంత్రికి తీసుకరావాలా? లేదా సమ్మర్ తీసుకరావాలా? సందిగ్దంలో మూవీ మేకర్స్ పడ్డారు. మరోవైపు.. ఈ సినిమా విడుదల తేదీపై సోషల్ మీడియా మీల్స్ , ట్రోలింగ్స్ కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా మీల్స్ , ట్రోలింగ్స్ బేస్ చేసుకుని ఓ స్పెషల్ మీడియో క్రియేట్ చేసింది తండేల్ మూవీ టీం.

Akkineni Naga Chaitanya Sai Pallavi s Thandel movie team released a special video on Movie release date

తండేల్ స్పెషల్ వీడియోలో .. తొలుత ఈ మూవీ విడుదలపై సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం, మీల్స్ , ట్రోలింగ్స్ ను పాయింట్ అవుట్ చేశారు. తండేల్ మూవీని సంక్రాంతికి విడుదల చేయాలో.. సమ్మర్లో రిలీజ్ చేయాలో.. తేలాలంటే.. థగ్స్ ఆఫ్ వార్ అనే కండక్ట్ చేద్దామని మూవీ టీం డిసైడ్ అవుతారు. మూవీ టీం సమ్మర్.. సంక్రాంతి గ్రూప్ గా విడిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. మూవీ టీం పై సీరియస్ అవుతాడు.

'కోట్లు పెట్టి సెట్ వేసి.. ఇంతమందిని పెడితే.. మీరు ఆడుకోవడానికా? పైగా దానికి టగ్ ఆఫ్ వార్ అని పేరా.. అంటూ అల్లు అరవింద్ డైరెక్టర్ పై సీరియస్ అవుతాడు. మరోవైపు అక్కినేని నాగచైతన్య తగ్గేదే లే లేదంటూ పోటీకి సై అంటాడు. దీంతో అల్లు అరవింద్ కూడా సరేలే అంటూ.. తండేల్ సెట్ లో మూవీ యూనిట్ టగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడారు. నాగచైతన్య, కొంతమంది మూవీ టీం ఒకవైపు.. డైరెక్టర్,కొంతమంది మూవీ యూనిట్ మరోవైపు ఉండి ఆడారు. సంక్రాంతి లేదా సమ్మర్ ఎప్పుడు రిలీజ్ చేయాలి అని ఈ గేమ్ ఆడారు. ఇరు గ్రూపుల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతుంది.

Akkineni Naga Chaitanya Sai Pallavi s Thandel movie team released a special video on Movie release date

కానీ, ఇంతలోనే వారు లాగుతున్న తాడు ఒక్క సారిగా తెగిపోతుంది. దీంతో అల్లు అరవింద్ ఏందే ఇది.. ఇలాంటివి నేనెప్పుడూ చూడలే.. అంటూ ఓ ఫన్నీ రియాక్షన్ ఇస్తారు. ఆ తరువాత 'దుల్ల కొట్టడానికి మీరు మీరు కొట్టుకోడం ఎలా..? నాకొదిలేయండి అయ్యా గోల.. నేను వేస్తాను ఈల!' అని సరదాగా కనిపించారు. తండేల్ మూవీ రిలీజ్ తేదీని ప్రకటిస్తారు అంటూ అల్లు అరవింద్.

తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను గీతా ఆర్ట్స్ ప్ర‌క‌టించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తండేల్ ను తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ మ‌రియు హిందీ భాష‌ల్లో విడుద‌ల చేస్తామ‌ని చిత్ర టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తండేల్ టగ్ ఆఫ్ వార్ వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X