ఒకే శరీరం ఒకే రక్తం పంచుకుని పుడితే అద్భుతం.. సవ్యసాచి టీజర్ ఊరమాస్!
అక్కినేని నాగ చైత్యన్య వరుస చిత్రాలతో జోరుమీద ఉన్నాడు. ఇటీవల వినాయక చవితి సందర్భంగా శైలజారెడ్డి అల్లుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైతు మరోమారు సవ్యసాచిగా ముస్తాబవుతున్నాడు. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న సవ్యసాచి చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. తాజగా ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు.
వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు చందూ ముండేటి మరోమారు సవ్యసాచి ద్వారా తన ప్రత్యేకతని చాటుకునట్లు తెలుస్తోంది. వైవిధ్యభరితమైన కాన్సెప్ట్, అదిరిపోయే మాస్ ఎలిమెంట్స్ తో సవ్యసాచి చిత్రం రూపొందినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్ర కాన్సెప్ట్ ని తెలియజేస్తూ టీజర్ లో పొందుపరిచిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.

'ఒకతల్లి రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములు అంటారు. అదే ఒకే రక్తం, ఒకే శరీరం పంచుకుని పుడితే అద్భుతం అంటారు. అలాంటి అద్భుతానికి మొదలుని, వరసకు కనిపించని అన్నని, కడదాకా ఉండే కవచాన్ని ఈ సవ్యసాచిలో సగాన్ని అంటూ చైతు చెబుతున్న డైలాగ్ ఉత్కంఠ భరితంగా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అద్భుతంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











