తండేల్ నావల్ల సక్సెస్ కాలేదు! అసలు నిజం చెప్పిన చైతూ!
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ఎంత వినయంగా ఉంటారో తెలిసిందే. అక్కినేని నాగేశ్వర రావు, తండ్రి నాగార్జున నట వారసత్వాన్ని తన భుజాలపై మోస్తున్నారు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా చక్కటి చిత్రాలను ప్రేక్షకులకు అందించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందించేందుకు ఆడియెన్స్ యాంగిల్లో సినిమాలు తీస్తున్నారు. రెండు దశాబ్దాలుగా తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తూనే వస్తున్నారు. విభిన్న పాత్రలు పోషిస్తూ కూడా తన అభిమానుల మనస్సును మరింతగా గెలుచుకుంటున్నారు.
'జోష్' నుంచి మొదలు 'తండేల్' వరకు డిఫరెంట్ రోల్స్ తో అలరిస్తూనే వస్తున్నారు. అయితే చైతూ కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రాలు కానీ.. బాక్సాఫీస్ ను తిరగరాసిన సినిమాలు లేకున్నా.. తనకున్న మార్కెట్ లో మంత్రి ఫీల్ గుడ్ సినిమాలు చేస్తున్నారు. అంతకంతకు తన స్టార్ డమ్ ను పెంచుకుంటూ వస్తున్నారు. తన టాలెంట్ ను నమ్ముకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నారు. స్టార్ కిడ్ అయినా.. ఎక్కడా చైతూ ప్రవర్తనను అలా కనిపించదు. సినిమా వేదికలపైనా చూడా ఆచీతూచీ మాట్లాడుతుంటారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ అందరి సపోర్ట్ ను పొందుతున్నారు.

అయితే నాలుగేళ్లుగా చైతన్య కెరీర్ లో పెద్దగా హిట్ లేదు. దీంతో వరుసగా విభిన్న కథలతో సినిమాలు చేస్తూనే వచ్చారు. కానీ పెద్దగా ఫలించలేదు. చివరి 'తండేల్' రూపంలో విజయం వరించింది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించారు. చందూ మొండేటి దర్శత్వం అదిరిపోయింది. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ఫీమేల్ లీడ్ లో అదరగొట్టింది. ఇక దేవీశ్రీ ప్రసాద్ తనదైన శైలిలో సంగీతం, బీజీఎం అందించి సినిమాకు మరింత ప్రాణం పోశారు.
కాగా, ప్రస్తుతం చిత్ర యూనిట్ పలు చోట్ల సక్సెస్ యాత్ర చేస్తోంది. ఈ సందర్భంగా నాగచైతన్య 'తండేల్' సక్సెస్ పట్ల ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. నాగచైతన్య మాట్లాడుతూ.. 'తండేల్ ఇంత పెద్ద విజయం సాధించడం సంతోషంగా ఉంది. సినిమా సక్సెస్ నా ఒక్కడి వల్ల కాలేదు. సక్సెస్ గురించి మాట్లాడాల్సి వస్తే 50 శాతం క్రెడిట్ దేవీశ్రీ ప్రసాద్ కే చెందుతుంది. ప్రతి సన్నివేశంలో దేవీ ఇచ్చిన ట్యూన్ కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సక్సెస్ ఆయన వల్లే అని చెప్పడంలో ఎలాంటి మొహమాటం లేదన్నారు.'
ప్రస్తుతం ఏ సినిమా ఎప్పుడు ఆడుతుందో.. ఒక ఆడినా నెక్ట్స్ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని రోజుల్లో హిట్ పడితే నావల్లే అని చెప్పే తారలను పలు సందర్భాల్లో చూసే ఉంటాం. కానీ చైతూ మాత్రం వరుసగా ఫ్లాప్స్ వచ్చినా హిట్ పడగానే పొంగిపోలేదు. సమన్వయ ఆలోచనతో తన పరిధిలోనే మాట్లాడుతుండటం అందరికీ నచ్చుతోంది. చెదరని వ్యక్తిత్వంతో చైతూ మరింతగా ముందుకు వెళ్లాలని, మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నారు. ఇక 'తండేల్' తొలి రోజు రూ.21 కోట్లు కలెక్ట్ చేసింది. రెండో రోజు రూ.41.20 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా సాధించింది.


Click it and Unblock the Notifications











